Tuesday, February 17, 2026

ప్రజల కష్టాలను తీర్చడమే తన జీవిత ఆశయం

బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలోని ప్రజల కష్టాలను తీర్చడమే తన జీవిత ఆశయమని తాను కాంగ్రెస్ పార్టీలో చేరింది పదవుల కోసం డబ్బు కోసం కాదని ఈ ప్రాంత ప్రజల కష్టాలను ఘట్టెక్కించడమే తాను లక్ష్యంగా ఎంచుకున్నానని మాజీ సభాపతి ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మంజూరైన బిల్లుల చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు పోచారం పంపిణీ చేశారు.కోటగిరి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మరియు బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు బిల్లు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.

ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ మాత్రమేనని పోచారం స్పష్టం చేశారు. 4000 ఇళ్ళను కాంట్రాక్టర్ల ద్వారా నిర్మిస్తే, మిగతా 7000 ఇండ్లను లబ్ధిదారులు స్వంతంగా నిర్మించుకోవడం జరిగిందని వివరించారు.స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టుకునే ప్రభుత్వ ఆదేశాలు ఈరోజుకు కూడా రాష్ట్రంలో లేదు. అయినా మొండి దైర్యం, పేదలకు స్వంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో బాన్సువాడ నియోజకవర్గంలో నేను ఆనాడు శ్రీకారం చుట్టామన్నారు.

పేదలు కట్టుకుని సంతోషంగా ఉన్నారు
డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన బిల్లులు గత ప్రభుత్వంలో 93 శాతం వచ్చాయి.ఇంకా కేవలం ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి.
నేను కాంగ్రెస్ పార్టీలో చేరే రోజు కూడా బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరాను అని పోచారం పేర్కొన్నారు.రైతులకు రుణమాఫీ అమలు జరుగుతున్న కఠిన పరిస్థితులలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.

బిల్లులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కొద్ది రోజుల్లోనే మిగిలిన డబ్బులు కూడా వస్తాయి. లబ్ధిదారులకు అందిస్తాం.గత పదేళ్ళలో బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఇంకా కొన్ని పనులు మధ్యలో ఉన్నాయి. నేను రిటైర్ అయ్యే లొపు మొదలు పెట్టిన పనులు పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే నా ఆశయం. పార్టీ మారే రోజు కూడా నాకు మంత్రి పదవి అవసరం లేదు, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వమని కోరాను. ముఖ్యమంత్రి అంగీకరించారు.

పార్టీ మారడంలో నాకు ఎలాంటి స్వార్థం లేదు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను అనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు స్పష్టంగా వివరించారు. కోటగిరి కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, కొట్టం మనోహర్, ఏజాజ్ ఖాన్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లుల చెల్లింపు అధికారి నాగేశ్వరరావు, గౌతం, అంబర్ సింగ్, శ్రీధర్ , కొత్తపల్లి చాగం కృష్ణారెడ్డి,సత్యనారాయణ, బుజ్జి, వెలగపూడి గోపాల్ , ఉత్తం పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular