బడ్జెట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని మరిచిందని పెన్షన్ పెంపు ప్రవస్థానలేని బడ్జెట్లు వికలాంగులను మోసం చేశారని ఎన్ పి ఆర్ డి నిజాంబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఆరోపించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఎన్ పి ఆర్ డి జిల్లా గౌరవ అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారతకు 2024 25 బడ్జెట్లో 1225.27 కేటాయించింది. గత సంవత్సరంలో బడ్జెట్ తో పోలిస్తే 0.02. పాపం పెంచింది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలనీ డిమాండ్ చేశారు. వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615. 33 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ను ప్రత్యేకంగా నిధులను కేటాయించి కేంద్రము 3000 పెన్షన్ రాష్ట్రము 6000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియు వికలాంగులకు ఇంటి స్థలాలు ఇండ్ల నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు కేటాయించాలి. వికలాంగుల అందరికీ ప్రత్యేకంగా అంతోదయ కార్డులు మంజూరు చేసి నెలకు 35కిలోల బియ్యం ఇవ్వాలి బ్రతకడానికి స్వయం ఉపాధి రుణాలు ప్రతి వికలాంగుడికి ఐదు లక్షలు ఇవ్వాలి. సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా కమిటీ సభ్యులు మరియు నాయకులు ముంజ సాయిలు, ఎల్లయ్య, ఈశ్వర్ పటేల్, గంగారం పటేల్, జయరాం, సాయినాథ్, పల్లికొండ చింటూ, సోనీ, రామచందర్రావు, గంగమణి,లక్ష్మి, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల సంక్షేమం నిధుల కేటాయింపులో వివక్ష నిరసన
RELATED ARTICLES
