Monday, February 16, 2026

బాన్సువాడ నియోజకవర్గంలో ఏనుగు సుడిగాలి పర్యటన

ద్రోణ బాన్సువాడ

బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గంలో ఆదివారం పలు గ్రామాల్లో పర్యటన చేయనున్నట్లు సోషల్ మీడియా కన్వీనర్ బోయిడి లక్ష్మణ్ తెలిపారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో గత నెల రోజుల నుండి పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపు తగాదాలు కొనసాగుతున్న సందర్భంలో ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన చర్చాంశముగా మారనుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలో బల బలాలు పరీక్షించుకుంటున్నాయి.
ఉదయం 8. 30 గంటలకు ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ బాన్సువాడ లో అందుబాటులో ఉంటారు.

ఉదయం 9.00 గంటలకు బోనాల పండుగ రుద్రూర్ గ్రామంలో పాల్గొంటారు.

ఉదయం10.30 గంటలకి బోనాల పండుగ ఎత్తొండ గ్రామంలో పాల్గొంటారు.

ఉదయం11.30గంటలకి. బోనాల పండుగ వడ్డేపల్లి వర్ని గ్రామం లో
మధ్యాహ్నం12.30 గంటలకి వీరభద్రరావు రెండవ కుమారుడు కీర్తిశేషులు దుర్గ సంవత్సరికం అంకోల్ క్యాంప్ గ్రామంలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం3.00 గంటలకి అత్యంత పవిత్రమైన బంజారా సోదరుల తీజ్ ప్రోగ్రామ్ ఆపంది ఫామ్ గ్రామంలో పాల్గొంటారు.

సాయంత్రం 4.30గంటలకి కిషన్ నాయక్ సీనియర్

సాయంత్రం5.00 గంటలకి రామకృష్ణ గౌడ్ ఇంటికి బైరాపూర్ గ్రామానికి విచ్చేయనున్నారు.

సాయంత్రం 5.30గంటలకి రవి చౌహాన్ ఇంటికి పోచారం గ్రామంకి వెళ్తారు

సాయంత్రం6.00 గంటలకి అహ్మద్ బోర్లం ఇంటికి వెళ్తారు.ఈ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనగలరని మనవి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular