భారీ జరిమానాలు హెచ్చరించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
ద్రోణ నిజామాబాద్
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తీరాల్సిందేనని లేకపోతే భారీ జరిమానాలు విధించనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. ఆగష్టు 15 తరువాత ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి.
నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఆగష్టు 15 తరువాత ద్విచక్ర వాహనాదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా హెల్మేట్ ధరించకుండా వాహనాలు నడిపిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుదని పోలీస్ కమీషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
