Monday, February 16, 2026

అసెంబ్లీలో సీఎం “పవర్” పై ఫైర్

ద్రోణ హైదరాబాద్:జులై 29

బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఛత్తీస్‌ గఢ్, యాదాద్రి, భద్రాద్రి ఒప్పందాలపై విచారణ చేయాలని బీఆర్ఎస్ నేతలే అడిగారని, అందుకే విచారణ కమిషన్‌ను నియమిం చామని తెలిపారు. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారని చెప్పారు.విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు.
విచారణ కొనసాగించా ల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియ మించాలని ఆదేశించిందని అన్నారు. కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తామని స్పష్టం చేశారు.తెలంగాణకు బీఆర్ఎస్ నేతలే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతు న్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ దక్కిందని చెప్పారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు, సంబంధిత ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉంద ని తెలిపారు.కానీ, ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని చెప్పారు.
రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణ కు ఇప్పించారని తెలిపారు. 53.46శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యు త్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారని అన్నారు.
సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు విద్యుత్ ఒప్పందాల విష యంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఇంకెన్నాళ్లు ఈ ఊదరగొట్టు మాటలు అని నిలదీశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular