Monday, February 16, 2026

పోచారం పార్టీ మారింది తనయుల బిల్లుల కోసమే

పత్రికా సమావేశంలో ముక్తకంఠంతో నినదించిన కాంగ్రెస్ నాయకులు

ద్రోణ బాన్సువాడ

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతినిత్యం ప్రచారం చేస్తున్నారని, వారి తనయుల బిల్లులు రాబట్టేందుకే కాంగ్రెస్ పార్టీలోకి పోచారం వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తకంఠంతో నినదించారు.
బాన్సువాడ పట్టణంలోని ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాస్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం పార్టీ మారానని ప్రచారం చేసుకుంటున్నా మాట పచ్చి అబద్ధమని కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారారని అన్నారు. నియోజకవర్గంలో చిన్నాచితక కాంట్రాక్టు పనులు చేసిన మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి కేవలం అతని పుత్రుడి బిల్లులు 532 కోట్లు మంజూరు చేసుకున్నారని దీని కోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. బిల్లుల చెల్లింపుకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.ఇకనైనా పోచారం అబద్ధాలు అసత్యాలు చెప్పడం మాని వాస్తవాలు మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని గ్రూపులుగా విడగొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ దేశాయ్, శివరాజ్ దేశాయ్, హనుమాన్లు కమలాకర్ రెడ్డి, ప్రతాప్ సింగ్ రాథోడ్, శ్రీనివాస్ యాదవ్,దశరథ్ నాయక్, వెంకట్ రెడ్డి,వాహిద్ హుస్సేన్, అమృత్ చందర్, శీను కౌన్సిలర్, జల్లాపల్లి అబ్దుల్లా,యాదుల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular