రైతుల బడ్జెట్ పత్రాలను తగలబెట్టిన నాయకులు
యస్ కే యం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం
చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్ కే యం రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య మాట్లాడుతూ మోడీ సర్కార్ కార్పొరేట్ వ్యక్తుల ఉడిగం చేస్తూ బడ్జెటు కేటాయించిందని అన్నారు. అన్నం పెడుతున్న రైతును తుంగలోకి తొక్కి రైతు పోరాటానికి ఇచ్చిన హామీలను విస్మరించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా రైతుల పంటలకు నామమాత్రం ధరలు పెంచి సంబరాలు చేసుకుంది.

రైతును రాజు ను చేస్తాం అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని చెత్తబుట్టలో పడేసి నగ్నంగా కార్పోరేట్ వ్యక్తులకు బడ్జెట్ కేటాయింపులు కనుక రైతు వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ కమిటీ పిలుపు మేరకు బడ్జెట్ పత్రాలను దగ్ధంచేయడం జరిగింది.

పెద్ది వెంకట రాములు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధంగా ఉంది యూపీలో ఇప్పటికి అక్కడి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పటికైనా మోడీ సర్కార్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనరు సురేష్, పి వెంకటేష్, వై రాజారెడ్డి, సాయ రెడ్డి, బొంబాయి గంగన్న, మరియు కార్మిక సంఘాల నాయకులు సాయ గౌడ్ , కిషన్ , గంగన్న, రమేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
