ద్రోణ కాకినాడ ప్రతినిధి
జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జోరు వానలో సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6:30 కు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుంచి 64 లక్షల 82,000 మందికి సచివాలయ సిబ్బంది టిడిపి నాయకులు, మంత్రులు ఎమ్మెల్యేలతో పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది అని నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలో టిడిపి నాయకులు సచివాలయ సిబ్బంది. లబ్ధిదారుల ప్రతి ఇంటికి వెళ్లి ఇవాళ సాయంత్రం లోగా 96% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు ఆదేశించారు. లక్ష్యంగా పెట్టుకుని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వృద్ధులు వితంతువులకు 4000 దివ్యాంగులకు 6000, దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఉన్నవారికి 10,000 నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయలు పెన్షన్లు అందిస్తున్నామని ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఈరోజు పేదల ముఖంలో చిరునవ్వులు చిందిస్తున్నాయంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం పెంచి వారి ఆదుకోవడమేనని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జగ్గంపేట ఎంపీడీవో, సర్పంచ్ బచ్చల నాగరత్నం సుధీర్, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి రాజు, కొండ్రోతు శ్రీను, వైబోగుల కొండబాబు యాదవ్, చేలికాని హరి గోపాల్, కోడూరి రమేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
