Monday, February 16, 2026

స్కిల్‌ యూనివర్సిటీకి భూమిపూజ

నెట్ జీరో సిటీ పరిధిలో మరికొన్ని నిర్మాణాలకూ శంకుస్థాపన

ద్రోణ హైదరాబాద్

తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ యూనివర్సిటీకి భూమిపూజ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమిపూజ నిర్వహించారు.స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోదముద్ర పడిన కొద్దిసేపటికే భూమిపూజ నిర్వహించారు.నెట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ వర్సిటీ తోపాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్,మోడ్రన్ స్కూల్,ప్రైమరీ హెల్త్ సెంటర్,కమ్యూనిటీ సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,శాసనసభ స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌ పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular