Monday, February 16, 2026

పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

ద్రోణ హైదరాబాద్:ఆగస్టు 02

పారిస్ ఒలింపిక్స్ లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడింది. పోరాడి ఓడింది. క్వార్టర్స్ చేరు కుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాటపట్టింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడింది. తొలిగేమ్ ను గెలిచే ఛాన్స్ సింధు చేజార్చుకుంది. ఆ తర్వాత ముందుకు సాగలేక పొఇంది.మ్యాచ్ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు..మళ్లి ఎంత ప్రయత్నించినా..ప్రత్యర్థి ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే 19-19 స్కోరుతో సమం కావడంతో సింధకు మంచి ఛాన్స్ లభించింది. కానీ ప్రత్యర్థికి రెండు పాయింట్లు ఇచ్చింది. దీంతో గేమ్ ను కోల్పోవాల్సి వచ్చింది.ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందంలో బిన్ జియానో రెండో గేమ్ లో సత్తా చాటింది.
13-5 తో ఆధిక్యంతో దూసు కెళ్లింది. ఇక సింధు పుంచు కోవడం కష్టంగా మారింది. ప్రత్యర్థి అదే ఊపులో ఆడింది. ఈ దశలో సింధు మూడు పాయింట్లు సాధించినా..వెంటనే ప్రత్యర్థి రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్ ను సొంతం చేసు కుంది.టోక్కోలో బిన్ జియావో ను ఓడించిన సింధు కాంస్యం గెలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular