ద్రోణ హైదరాబాద్: ఆగస్టు 02
రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ, రేపు గవర్నర్ల సదస్సు జరుగనుంది. గవర్నర్ల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్న ర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి. నూతన నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివ ర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుక బడిన జిల్లాలు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్ర పై చర్చ ఉంటుంది.
