Monday, February 16, 2026

ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ ఆహ్వానిస్తుంది

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ,:-

సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర.భూమయ్య మాట్లాడుతూ వర్గీకరణపై మొట్టమొదటిసారిగా మద్దతు పలికిన జాతీయ పార్టీ సిపిఐ ఏనని, సిపిఐ ఎంపీగా ఉన్న కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి పార్లమెంట్లో నిలదీయడం జరిగిందని అన్నారు.
గత 30 సంవత్సరాలుగా ఈ వర్గీకరణ పై పోరాటాలు చేసి అమలు చేసుకోవాలని చూసిన ఎస్సీలు, ఎస్టీలు సంతోషంగా ఈ తీర్పును ఆహ్వానిస్తూనారని దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని సిపిఐ కోరుకుంటున్నాం ఈ విషయంలో నిన్న అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తూ ఇప్పటికే వివిధ రంగాల్లో ఇచ్చిన నోటిఫికేషన్ లకు వర్గీకరణ తీర్పును అమలు చేస్తామని చెప్పడం సంతోషకరం కావున దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కోరుతున్నాం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బి.రఘురాం మరియు ఆనంద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular