పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి : ఆకాశవాణి ట్రాన్సమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
స్వచ్ఛమైన పర్యావరణాన్ని యధావిధిగా ముందు తరాలకు అందించాలి : కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్
నిజామాబాద్ లోని కేంద్రీయ విద్యాలయలో అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమం
కేంద్రీయ విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు
నిజామాబాద్, ప్రతినిధి ద్రోణ:-02 ఆగస్టు 2024
చెట్ల పెంపకమే భవిష్యత్ తరాలకు అందించే గొప్పబహుమతి అని, మొక్కలు నాటి సంరక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ తెలిపారు.
భారతదేశ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ పిలుపు మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం, నిజామాబాద్ మరియు ఆకాశవాణి నిజామాబాద్ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయలో శుక్రవారం అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

అందులో భాగంగా కేంద్రీయ విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ మాట్లాడుతూ…. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణంతో కూడిన భూమిని అందించటం మనందరి బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. పర్యావరణం – ప్రగతిని సమన్వయం చేసుకుని ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని, ఈ దిశగా విద్యార్థులంతా అమ్మ పేరిట ఒక మొక్క స్ఫూర్తిని వ్యాప్తి చేయటంలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశంలో అటవీ ప్రాంత విస్తీర్ణం పెంచటంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ఆవశ్యకమన్న ప్రధానమంత్రి మాటలు అక్షర సత్యామన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కులు నాటడమే కాకుండా, ఆ చాయా చిత్రాన్ని తీసుకుని #Plant4Mother #एकपेड़माँकेनाम హ్యాష్ ట్యాగ్ లను వినియోగించి సామాజిక మాథ్యమాల్లో పంచుకోవాలని సూచించారు.

పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి : ఆకాశవాణి ట్రాన్సమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులు కావాలని ఆకాశవాణి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్ ఆకాంక్షించారు. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యధావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉందన్నారు. నేల… తల్లి లాంటిది. మనల్ని పెంచి పోషించడానికి అమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో, అమ్మను జాగ్రత్తగా చూసుకోవడానికి మనం కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. అమ్మ లేని మనిషే కాదు, అన్నం తినని మనిషి కూడా ఉండడు. అందుకే ప్రతి మనిషి నేలను అమ్మలాగే చూసుకోవాలన్నారు.

స్వచ్ఛమైన పర్యావరణాన్ని యధావిధిగా ముందు తరాలకు అందించాలి : కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యధావిధిగా ముందు తరాలకు అందించాలని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బిఎస్ మీనా అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందన్నారు. మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను యధావిధిగా ముందు తరాలకు అందించడం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ అసిస్టెంట్ రసిద్, దూరదర్శన్ రిపోర్టర్ బొబ్బిలి నరసయ్య, సీబీసీ ఎంటిఎస్ పోచయ్య, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
