నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ జరిగే ఆందోళనలు జయప్రదం చేయాలని పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిరసన ప్రదర్శనలు చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. అర్హులైన వారందరికీ తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలిచ్చి, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలివ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరుగ్యారెంటీలను సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం రేపటినుండి తహసిల్దార్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి పి.డి.ఎస్.యు జిల్లా ప్రధానకార్యదర్శి కే.గణేష్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు బి.లింగం, టీ.విఠల్ తదితరులు పాల్గొన్నారు.
