మంత్రి సీతక్క
ద్రోణ హైదరాబాద్
ఐరన్ లేడి ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన ఇందిరా గాంధీ జన్మదినం రోజున మహిళా శక్తి విజయెత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందనీ మంత్రి సీతక్క అన్నారు.
ఇందిరా గాంధీ స్పూర్తితో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు.
మహిళాభివృద్దికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతోంది.
ప్రజా ప్రభుత్వం మహిళా ప్రభుత్వం.
ఇక్కడికి తరలివచ్చిన మహిళలను చూస్తే బతుకమ్మ పండుగ మరో సారి వచ్చినట్లు అనిపిస్తుంది. మహిళా సంక్షేమాన్ని ఆకాంక్షించి అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాము.రూ. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా, లోన్ బీమా కింద 35 కోట్ల రూపాయలు అందిస్తున్నాం.మహిళాభివృద్దే దేశ అభివృద్ది అన్న డా. బీ ఆర్. అంబేద్కర్ ఆలోచనలను ఆచరించే ప్రభుత్వం మాది,నాడు వైయస్సార్ మహిళలను లక్షాధికారులను చేసేందుకు పావలా వడ్డీ పథకాన్ని తెచ్చారు.
నేడు రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
మహిళా సంఘాలకు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం.
ఈ ఏడాదిలో 26 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను నేడు మంజురు చేస్తున్నాం.ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎగతాళి చేసే విధంగా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది.64 లక్షల మంది మహిళా సభ్యులతో పాటు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగపడుతోంది.
మహిళా సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చే విధంగా మా శాఖ పని చేస్తుంది.అతి తక్కువ సమయంలో కొత్తగా 67 వేల మంది మహిళలను గ్రూపులో సభ్యులుగా చేర్పించాం.
రాబోయే కాలంలో ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచేందుకు పనిచేస్తాం.
ప్రతి మహిళను సంఘంలో సభ్యులుగా చేర్చుతాం .
మహిళా సంఘాలకు 150 ఆర్టీసీ బస్సులను కేటాయిస్తున్నాం.
వేయి మెగా పట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నాం.
17 రకాల వ్యాపారాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం.
మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
22 జిల్లాల్లో రూ.110 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం.
అడిగినన్ని నిధులు కేటాయిస్తున్న పెద్దన్న రేవంత్ రెడ్డిని, చిన్నన్న బట్టి విక్రమార్కను మహిళలంతా దీవించాలని కోరుతున్నాం.
అందరి సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం.