ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న పోచారం
తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ ఆదర్శం
11 వేల డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు
ప్రజల్లో మమేకమవ్వడమే ఆయనకు మహా పిచ్చి
సర్పంచ్ ఎన్నికల్లోను ప్రత్యేక ముద్ర
నేడు మహానేత పోచారం జన్మదిన వేడుకలు
ద్రోణ,బాన్సువాడ బ్యూరో చీఫ్, ఫిబ్రవరి 10
బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలదరిన చేర్చడమే తన లక్ష్యంగా ప్రతినిత్యం కృషి చేస్తూ ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దిన ఘనత ఆ మహానేతకే దక్కింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరియు ప్రజా ప్రతినిధులకు ప్రజాక్షేత్రంలో తిరిగేందుకు ఇబ్బందిగా భావిస్తారు. కానీ పోచారం మాత్రం ప్రతినిత్యం ప్రజల్లో మమేకమైతేనే సంతృప్తిని చెందుతారు. అభివృద్ధి విషయంలో ఏనాడు రాజీ పడకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గానికి ఏడు సార్లు ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎదురు, తిరుగులేని నాయకునిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. గత తెలుగుదేశం, టిఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలలోను పోచారం తన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఏనాడు డబ్బు సంపాదన పై ఆయన కన్ను వేయలేదు. ఆయన రాజకీయ జీవిత చరిత్రలో ఎన్నో ఉన్నతమైన అవకాశాలు ఆయన దరి చేరాయి. తన రాజకీయ జీవిత చరిత్రలో మచ్చలేని నాయకుడిగా, ప్రతినిత్యం ప్రజా సమస్యలు తన సమస్యగా భావిస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ తనదైన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. గత నెల రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను నియోజకవర్గంలో పోచారం కుటుంబం తమ సత్తాను చాటుకున్నారు. పోచారం మద్దతిచ్చిన మద్దతుదారులదే నియోజకవర్గంలో హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం రైతుల గురించి ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. రైతన్నలకు సాగునీరు అందించడమే తన పరమావధిగా భావిస్తూ ఉంటారు. పంటల సాగుకు నీరు అందించడంతోపాటు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధానము, పండిన పంటలకు రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సకాలంలో డబ్బులు చెల్లించడంలో పోచారం కృషిని రైతులు ఎన్నటికీ మరువలేరు. సాగునీటి విషయంలో ప్రతి నిమిషం ఆలోచన చేస్తూనే ఉంటారు. పంటల సాగులోను తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం ప్రత్యేక స్థానం పోచారం కల్పించారు. ముందస్తు పంటలను సాగు చేయడం రాష్ట్రంలోనే ముందస్తుగా పంటలు చేతికి అందడం ఇటువంటి విషయాల్లో ఈ ప్రాంత రైతాంగం గర్వంగా భావిస్తుంది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అందవేసిన చేయి. నియోజకవర్గంలోని పేద ప్రజలకు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలను అందించడంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనే ముందంజలో నిలిపారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిచ్చేందుకు ఆనాడు రూపకల్పన చేశారు. ఆనాటి ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టి ఇవ్వడం మంచి లక్ష్యమే అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అమలులో మాత్రం సాధ్యం కాలేదు. అటువంటి కష్టతరమైనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో సైతం పోచారం 11వేల ఇళ్లను మంజూరు చేయించడంతోపాటు ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ఎంతో కృషి చేశారు. ఆనాటి ఇళ్ళ నిర్మాణ లబ్ధిదారులకు నేటికీ బిల్లుల చెల్లింపు పై కసరత్ చేస్తూనే ఉన్నారు. విద్యాభివృద్ధి విషయంలో, పేద ప్రజలకు వైద్యం అందించే విషయంలో ఆయన చేసిన కృషిని ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ మరువలేరు. గత ప్రభుత్వం పేదలకు మూడు ఎకరాల సాగు భూమిని అందించే పథకాన్ని అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అట్టి పథకాన్ని సైతం బాన్సువాడ నియోజకవర్గం లోనే పేద ప్రజలకు సాగుభూములను అందించిన ఘనత పోచారం కు మాత్రమే దక్కింది. ఆయన చేసిన అభివృద్ధి ఎంత చెప్పుకున్నా ముగింపు అంటూ ఉండదు. రోడ్ల నిర్మాణాల విషయంలోనూ నియోజకవర్గంలోని 80% రోడ్లకు మహర్దశ లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణం విషయంలో ఆయన చేసిన కృషిని గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరవకుండా రుణపడి ఉండాల్సి ఉంటుంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బడి, వివిధ మతాలకు చెందిన దేవాలయ నిర్మాణాలను పెద్ద ఎత్తున పూర్తి చేశారు. గ్రామాల్లో కులాల వారీగా కమిటీహాలను ఏర్పాటు చేసిన నియోజకవర్గం బాన్సువాడ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ప్రజా సౌలభ్యం కోసం నియోజకవర్గంలో గతంలో నాలుగు మండలాలు ఉంటే నేడు 9 మండలాలను ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగా ప్రజలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులోనూ ఆయన చేసిన కృషిని ప్రజలు ఎన్నటికీ మరువలేరు. బాన్సువాడ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా రూపుదిద్ది బాన్సువాడను సుందరీకరించారు. బాన్సువాడ నేడు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. బీర్కూర్, వర్ని, చందూర్, మోస్రా మరియు బాన్సువాడ పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా డివైడర్లను ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో చిన్న చిన్న గ్రామాలు సైతం పట్టణాలకు దీటుగా వెలుగులు చిమ్ముతున్నాయి. పోతంగల్ ప్రాంతాన్ని నూతన మండలం గా ఏర్పాటు చేయడంతో పాటు మండలం పరిధిలోని పీఎస్ఆర్ నగర్ లో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అట్టి పనులకు ఇప్పటికే భూమి పూజ సైతం జరిపించి లాంచనంగా పనులను ప్రారంభింప చేశారు.
ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మింప చేయడమే తన లక్ష్యం
బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మింప చేయడమే తన లక్ష్యంగా భావిస్తూ, తన నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలెవ్వరు ఉండకూడదని ప్రతినిత్యం శబదం చేస్తూ పేదలకు ఇళ్ళను మంజూరు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల్లో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయారు. అటువంటి క్లిష్టతరమైనటువంటి పథకాలను సైతం బాన్సువాడ నియోజకవర్గం లో విజయవంతం చేసి ఆయన తన సత్తాను చాటుకున్నారు. ప్రభుత్వం ఆనాడు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం పేదలకు ఇళ్లను తామే నిర్మింప చేసి అందిస్తామని ప్రగల్బాలు పలికింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో మొదట్లో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినప్పటికీ నిర్మించిన కాంట్రాక్టర్లకు నష్టాలు చవిచూశాయి. నష్టాల పాలు కావడంతో ఇల్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు నిరాకరించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇళ్ల నిర్మాణాలను చేపట్టి తీరాల్సిందేనని తమ అనుచర గణానికి హుకుం జారీ చేశారు. ఆయన మాటే వేదవాక్కుగా భావించే కార్యకర్తలు ముందుకు వచ్చి బాన్సువాడ నియోజకవర్గం లో సుమారు 5 వేల ఇళ్ళను నిర్మింప చేశారు. ఆనాడు నిర్మించిన ఇళ్లను పేద ప్రజలకు అందించారు. కాంట్రాక్టర్లు నిరాకరించినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాల్సిన ఉన్నప్పటికీ, నిబంధనలు పక్కనపెట్టి ఇళ్ల నిర్మాణాలను చేపట్టి తీరారు. తాము చేసే పనిలో నిజాయితీ, పారదర్శకత ఉన్నంతకాలం ఎటువంటి నిబంధనలు తమకు ఎటువంటి ఇబ్బందులు రావని ఇళ్ల నిర్మాణాల్లో పోచారం నిరూపించారు. లబ్ధిదారులు ముందుకు వస్తే తమ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే వీలు కల్పించారు. సొంత స్థలాల్లో లబ్ధిదారులే స్వతగా ఇల్లు నిర్మించుకునే వీలు కల్పించడంతో ఎంతోమంది ఇల్లు లేని పేదలు ముందుకు వచ్చి సుమారు 6000 ఇళ్లను మంజూరు చేయించి లబ్ధిదారుల ఇళ్లను నిర్మింప చేశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే దశలోనే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రావడం, సాధారణ ఎన్నికల్లో గత కెసిఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం టిఆర్ఎస్ పార్టీ చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. బాన్సువాడ ప్రజలు మాత్రం పార్టీలను సైతం లెక్కచేయకుండా పోచారం ఏ పార్టీలో ఉన్న తమ ఓటు పోచారానికే అన్న చందంగా ఎన్నికల్లో మెదులుకుంటారు. శాసనసభ ఎన్నికల్లో గత ప్రభుత్వం కుప్పకూలడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని చేజెక్కించుకుంది. బాన్సువాడ నియోజకవర్గం లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకున్నప్పటికీ బిల్లులు పెద్ద ఎత్తున రావాల్సి ఉన్నాయి. పోచారం లాంటి అపార అనుభవం ఉన్న మహా శక్తి యుక్తులు కలిగిన నేతను కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మరల్చుకుని ప్రభుత్వానికి సూచనలు సలహాలు అందించాలని కోరడం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడకుండా అభివృద్ధిలో మళ్ళీ పరుగులు పెట్టాలన్న ఉద్దేశంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అభివృద్ధి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో రాజకీయాల్లో ఆనాడు పావులు కదిపారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాల్లో బాన్సువాడ నియోజకవర్గం ముందంజలో నిలిపే విధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతినిత్యం నేటికీ కృషి చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్య కృషివలుగా ఉమ్మడి రాష్ట్రంలోనే పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీ పుత్రుడుగా అభివర్ణించి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.అటువంటి మహోన్నత వ్యక్తిపై రాజకీయ బురద జల్లుతూ కొంతమంది కొన్ని పార్టీల నాయకులు పబ్బం గడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరేమనుకున్నా , ఎవరెన్ని ఆరోపణ చేసిన తాను మాత్రం వెనకడుగు వేసేది లేదంటూ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. కార్యకర్తలకు సైతం ఏ ఆపద వచ్చిన పోచారం కుటుంబ సభ్యులు తామున్నామంటూ అభయం అందిస్తూ ఉన్నారు. పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి భవిష్యత్ రాజకీయ రథసారధిగా బాన్సువాడ నియోజకవర్గం లో తండ్రికి తగ్గ తనయుడుగా బాటలు వేస్తున్నారు. ఆయన ధైర్య సాహసాలతో, తనను నమ్మిన వారికి ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
మహానేత 77వ జన్మదిన వేడుకలు
ప్రతినిత్యం ప్రజల కోసం తపన పడే తమ నాయకుని జన్మదిన వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకునేందుకు కార్యకర్తలు రూపకల్పన చేసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా, పక్షపాత వైఖరి లేకుండా ప్రభుత్వ పథకాలను అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ పేదలకు అండదండలు అందిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు డబ్బు కోసం పోచారం పాకులాడలేదు. డబ్బే పరమావధిగా భావిస్తే ఆయన ఏనాడో కోట్లకు పడగలెత్తేవారు. 77 ఏళ్ల ప్రాయంలో సైతం పదహారేళ్ళ కుర్రాడిలాగా పరుగులు పెడుతూ కార్యకర్తలను పరిగెత్తిస్తూ ఉంటారు. నిత్య జీవితం ప్రజాసేవకే అంకితం . కార్యకర్తల వ్యక్తిగత లబ్దికన్నా గ్రామాల అభివృద్ధి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి ఆయన ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ ఉంటారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు ప్రజల కన్నా ఆయనకే ఎక్కువగా తెలుసు. గ్రామాల్లో పర్యటించే సందర్భాల్లో సమస్యలను ఆయన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడమే తన అంతిమ లక్ష్యంగా భావిస్తూ ఉంటారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 10 నుండి 20 మందిని పేరుతో పిలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యుల సైతం పేరుతో పిలవడం ఎంతో గర్వంగా కార్యకర్తలు భావిస్తూ ఉంటారు. సర్పంచ్ ఎన్నికల్లో సైతం పోచారం బలపరిచిన అభ్యర్థులను గెలిపించి తీరడంలో ఆయనకు ఎవరూ సాటి లేరని చెప్పవచ్చు. గ్రామాల్లో సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లలేకపోవడమే పాపం గా భావించవచ్చు. ఎటువంటి సమస్యనైనా తన దృష్టికి తీసుకువెళ్తే మాత్రం పరిష్కరించి తీరుతారు. గ్రామాల్లో పర్యటించే సందర్భంలో ప్రజలు సమస్యలను లేవనెత్తకపోతే ఆయనకు చికాకుగా ఉంటుంది. నేటి తరంలో గ్రామాల్లో సమస్యలు ప్రజలు తల ఎత్తితే నాయకులు తలనొప్పిగా భావిస్తూ ఉంటారు. పోచారం శీనన్న విషయంలో మాత్రం సమస్యలను తన దృష్టికి తీసుకురాక పోతే అసంతృప్తికి లోనవుతారు. గ్రామాల్లో కొన్ని సమస్యలను పోచారమే గుర్తించి పోచారం నిధులు మంజూరు చేయించి అట్టి పనులను పూర్తి చేయించడంలో పూర్తి శ్రద్ధాసక్తులను చూపిస్తారు. ఇటువంటి మహానేత మరి ఎన్నో ఏళ్ళు ఇటువంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలు అందించడంతోపాటు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.





