శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
దక్షిణ కాశీగా ప్రఖ్యాతి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం చేరుకున్న సందర్భంగా అర్చకులు సీఎం ని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రాజన్న దర్శనానికి ముందు ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించి అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ఆలయంలో ధ్వజస్తంభం వద్ద సీఎం కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మ వారు వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి కి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.
రాజన్న వారి దర్శనం సందర్భంగా సీఎం తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.