Tuesday, December 24, 2024

పోలీసులు జాతీయ సమగ్రతను కాపాడాలి

ఎ.ఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ జనరల్ , ఎస్.పి.ఎఫ్

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాన్కంపేట లోని కమీషనరేట్ శిక్షణ కేంద్రం లో సైబరాబాద్ నుండి ఎ.ఆర్ క్యాటగిరిలో కానిస్టేబుల్స్ ఎంపిక కాబడిన స్టయిపండరీ క్యాడెట్ ట్రెయినీ కానిస్టేబుల్స్ కు 9 నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో 250 మందికి నేడు ” దీక్షాంత్ పరేడ్ ( పాసింగ్ అవుట్ పరేడ్) కార్యాక్రమం నిర్వహించగా ముఖ్యఅతిధులుగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ,ఎస్.పి.ఎఫ్ డా॥ అనిల్ కుమార్, ఐ.పి.యస్., పాల్గొన్నారు.
మొట్ట మొదలు తెలంగాణ గీతం జై జై జై జయహే తెలంగాణ గానంతో మొదలు పెట్టారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుండి డైరెక్టర్ జనరల్ ఎస్.పి.ఎఫ్ డా|| అనిల్ కుమార్, ఐ.పి.యస్. గౌరవ వందన స్వీకరించి తర్వాత పరేడును వీక్షించారు. అనంతరం అట్టి కానిస్టేబుళ్లతో ప్రిన్సిపల్ బి. కోటేశ్వర్ రావ్ ప్రమాణం చేయించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధి డైరెక్టర్ జనరల్ ఎస్.సి.టి.పి.సి,సిని ఉద్దేషించి మాట్లాడుతూ కానిస్టేబుల్ శిక్షణ తీసుకన్నటువంటి వారికి అభినందనలు తెలియజేశారు. మీలో 80 శాతం మంది గ్రాడ్యూయేట్లు, 20 శాతం మంది పోస్టు గ్రాడ్యూయేట్లు ఉన్నారు. కాబట్టి మీ యొక్క విధులను సక్రమంగా బాధ్యతలతో నిర్వహిస్తారని, అంతేకాకుండా మీ అందరికీ మీ జీవితాలలో గుర్తు పెట్టుకునే ఒక సుదినమని అన్నారు. ఈ రోజు మీ జీవితాల్లో ఒక మైలురాయి వంటిది అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 శిక్షణ కేంద్రాలు నుండి ఈ రోజునా పాసింగ్ అవుట్ కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారని, జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ కు దేశంలో మంచి గుర్తింపు ఉందని, మీరంతా మీ విధులు సక్రమంగా నిర్వహించి. మంచిగా రానిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మీరు ఎక్కడ పని చేసినను జాతీయ సమగ్రతను కాపాడాలని అన్నారు. పోలీసుగా ప్రజల మాన, ప్రాణాలను, కాపాడాలని తెలిపారు. మీరు ఉన్నత స్థాయికి ఎదిగి ,అన్ని పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఐ.ఎ.ఎస్.లుగా, ఐ.పి.ఎస్.,లుగా రావాలని కోరారు. సమాజం మిమ్మల్ని గమనిస్తుందని, సమాజంలో ఉన్నత పౌరులుగా గుర్తింపు పొందేలా ఉండాలని అన్నారు. దీక్షాంత్ పరేడ్ యందు మీ ప్రదర్శన చాలా బాగుందని, శిక్షణ ఇచ్చిన సిబ్బందిని (ఫ్యాకల్టీని ) అభినందిస్తున్నానని, ప్రతీ ఒక్కరు ఆర్థిక క్రమశిక్షణ అనేది అత్యంత ఆవశ్యకం, సులువుగా డబ్బు సంపాదన వైపు చూడకుండా మీ జీవితాలను ఆదర్శప్రాయంగా ఉంచుకోవాలని సూచించారు. మీరు పోలీసులకు రావడానికి సహకరించిన మీ తల్లిదండ్రులందరినీ అభినందిస్తున్నాను. ఈ శిక్షణ కాలంలో మీరు కొత్త చట్టాలపై అవగాహన, ఫైరింగ్, దేహదారుడ్యత, ఆత్మస్థైర్యంసపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, చట్టబద్దమైన పౌరులుగా మీ సేవలను చూసి సమాజం గౌరవించేలా ఉండాలని. ఈ శిక్షణలో పోలీసింగ్ కు ముఖ్యమైనది క్రమశిక్షణ అంతేకాకుండా పోలీస్ అంటేనే త్యాగనిరతి అని మీరు సమాజంలో నేరాలు కట్టడి చేస్తూ సమాజంలో చెడును నిర్మూలిస్తూ సమాజంలో పోలీస్ విధులు నిర్వహిస్తారు. మీరు చేసే ప్రతీ పనిని సమాజంలో ప్రతీ ఒక్కరు గమనిస్తుంటారని అందుకే మీరు మంచి నడవడికతో పోలీసు ప్రతిష్టను పెంపోందించడానికి కృషి చేయాలని తెలియజేశారు.
మీ యొక్క సత్ప్రవర్తనతో, మీ యొక్క వ్యవహారశైలితో ప్రజల ఆత్మగౌరవానికి ఎలాంటి భంగము కల్పించడకుండా పోలీసు శాఖ యొక్క పేరు ప్రతిష్టలను పెంచుతారని, ప్రతీ ఒక్కరు ఫ్రెండ్లీ పోలీస్ వ్వవస్ధకు కృషి చేయాలని మనసార భావిస్తానని అన్నరు. మీరు మీ జిల్లాకు వెళ్లి రిపోర్టు చేసిన తర్వాత మీ జిల్లాలకు మరియు మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు.
శిక్షణలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బెస్ట్ ఇండోర్: ఎ. రాజు, బెస్ట్ అవుట్ డోర్: ఎమ్. నరేష్, బెస్ట్ ఫైరర్ : ఎ.క్రాంతి కుమార్ ,ఒవరాల్ చాంపియన్ కె. హర్ష వర్ధన్, పరేడ్ కమాండర్: జె.వాసు లకు బహుమతుల ప్రధానం డైరెక్టర్ జనరల్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.

ఇండోర్ / అవుట్ డోర్ సిబ్బందిని, పోలీసుయూనిట్ డాక్టర్ నరళ ని డైరెక్టర్ జనరల్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సింధు శర్మ, ఐ.పి.యస్, సయ్యద్ మస్తాన్ అలీ (సి.టి.సి వైస్ ప్రిన్సిపాల్ ) అదనపు డి.సి.పి లు ,7వ బెటాలియన్ అడిషనల్ కమాండెంటు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, స్పెషల్ బ్రాంచ్, సి.సి.ఎస్, ట్రాఫిక్, సి.సి.ఆర్.బి , ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.ఐలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, రిజర్వుఇన్స్పెక్టర్స్ మరియు శిక్షణ పొందిన వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular