రాష్ట్రంలోని రోడ్లను విస్తరింప చేస్తాం మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతామని వాటిల్లో భాగంగానే ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని సంక్రాంతి నాటికి రైతులకు రైతుబంధు పథకం ద్వారా డబ్బు చెల్లిస్తామని, రాష్ట్రంలోని రోడ్లన్నిటిని విస్తరింప చేసి వాటి పనులను పూర్తి చేస్తామని రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
నిజామాబాద్ పట్టణంలోని రాంరెడ్డి గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నిజామాబాదు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.
మీ అందరిని కలవడం చాలా సంతోషం.ఇందిరమ్మ రాజ్యంలో ఉచిత బస్సు,500 గ్యాస్ సిలిండర్,ఉచితగా కరెంట్..కేసిఆర్ పడేండ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకి ఇవ్వలేదు..
వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లకు పథకం ప్రారంభిస్తాం.
వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లకు పథకం ప్రారంభిస్తాం..
7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కూళేశ్వరం కట్టిండు.30 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకున్నాం.
గంగారాం బ్రిడ్జ్ కట్టాలని ఎమ్మెల్యే అడిగారు.దాన్ని ఇప్పుడే మంజూరి చేస్తున్నట్లు ప్రకటించారు.
రామ్ రాం బాబా సర్కిల్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం..సెంట్రల్ లైటింగ్,ఫౌంటైన్,సర్కిల్ నిర్మిస్తాం.నియోజకవర్గంలో ప్రతీ ఆర్ అండ్ బీ రోడ్లను అభివృద్ధి చేసి మీ అభిమానం చురగొంటాం.
వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బిటి రోడ్,మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తాం.
ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే బావ బామ్మర్ది ప్రజా ప్రభుత్వం పడిపోతాది అంటరు.ఇందాక ఎక్కడోకాయన కేసిఆర్ బొమ్మ పెట్టి దిక్షా దివాస్ అని పోస్టర్ చుసిన..నవ్వాల్నో ఏడవాల్నో అర్ధం కాలే..అయన గ్లూకోజులు,విటమిన్స్ తీస్కుంటూ చేసిన దీక్షకు కూడా ఇంత బిల్డప్ ఇస్తే ప్రజలు నవ్వుకుంటరని అనుకోవాలె కదా.. కేసిఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో మా గోనె ప్రకాష్ రావుని అడిగితే కుల్లం కుల్ల చెప్తడు.
కానిస్టేబుల్ కిష్టయ్యది,శ్రీకాంతాచారిది నిజమైన త్యాగం..
కేసిఆర్ ది నకిలీ దీక్ష
బూస్ట్,తాగుతూ,సెలైన్లు,విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు..
తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయంతో తెలంగాణ వచ్చింది..
నేను నల్గొండ చౌరాస్త లో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన.
ఇట్ల ఎప్పుడు ప్రచారం చేసుకోలే.మూడేండ్లు మంత్రి పదవి ఉండగా రాజీనామ చేశానన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మా పార్టీ కి ఒక్క వార్డ్ మెంబెర్ కూడా లేడు.సంక్రాంతి కి ఎకరాకు 7 వేల చొప్పున రైతు భరోసా వేస్తాం.ఇప్పటికే 22 లక్షల మంది ఖాతాల్లో 18 వేల కోట్లు జమ చేసినం.పేదవారి పిల్లలకి అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.
ఆరోగ్యశ్రీ ని 10 లక్షల కు పెంచి 90 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చుతున్నాం..
కొంచం ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా కూడా ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం..
ధర్పల్లి లక్ష్మినరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి 5 లక్షల అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.