Tuesday, December 24, 2024

రాజకీయ అపార అనుభవం కు పట్టం కట్టాము

రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం పోచారం వెల్లడి

ద్రోణ బాన్సువాడ ప్రతినిధి

రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన మహిళకు బీర్కూర్ మార్కెట్ కమిటీ పట్టం కట్టామని, అందరి ఆమోదంతోనే పదవి ఇవ్వడం జరిగిందని, కొందరికి ఇబ్బంది కలిగిన తాము న్యాయం చేసామని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు, త్వరలోనే ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా రైతులందరి రుణాలను మాఫీ చేసి తీరుతామన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీర్కూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో బీర్కూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టాసంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.పోచారం సమక్షంలో నూతన బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన దుర్గం శ్యామల శ్రీనివాస్, మరియు వైస్ చైర్మన్ యామ రాములు మరియు పాలక వర్గ సభ్యులు.
బీర్కూర్ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన దుర్గం శ్యామల శ్రీనివాస్ కి, వైస్ చైర్మన్ యామ రాములు కి, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి శ్యామల ,ఉమ్మడి బీర్కూర్ ఎంపీపీగా, దుర్కి సర్పంచ్ గా రాజకీయాల్లో అనుభవం ఉంది.ఉమ్మడి బీర్కూర్ మండలంలో నిజమైన కార్యకర్తకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావాలని సంకల్పించాను,దీనికి తోడుగా బాలరాజు కూడా సమర్ధించారు.ఎన్నో అడ్డంకులు వచ్చిన పెద్దలను ఒప్పించాను,కొంత మందికి బాధ కలిగి ఉండవచ్చు కాని సరైన నిర్ణయం అని ఒప్పుకున్నారు.వైస్ చైర్మన్ యామ రాములు స్థానిక నాయకులు,రైతు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావున వైస్ చైర్మన్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నాము, ఉమ్మడి మండలాల నాయకుల సమక్షంలో పాలకవర్గ సభ్యులను ఎంపిక చేసిన పేర్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి అందించాము, ప్రభుత్వం శ్యామల కి చైర్ పర్సన్ గా ఉత్తర్వులు జారీచేసింది.
రైతు రుణ మాఫీ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతులు 23లక్షల మందికి 18 వెల కోట్ల రూపాయల రుణమాఫీని చేసిన ఒకే ఒక ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇంకా కొంత మంది 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతులు రుణమాఫీ కావాల్సి ఉంది సాంకేతిక సమస్యల వలన రుణమాఫీ కాకపోవచ్చు, వారు సుమారుగా 4 లక్షల మంది రైతులు ఉన్నారు అని గుర్తించారు వారికి కూడా 2500 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయబోతున్నారు.
మిగిలిన 2లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుంది, వారి కోసం సుమారుగా పన్నెండు వేయిల కోట్లు అవసరం వారికి కూడా త్వరలో రుణమాఫీ జరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular