ద్రోణ కోటగిరి
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు ముదిరాజ్ నాయకులు కొనియాడారు. పోలీస్ కిష్టయ్య 15వ వర్థంతి సందర్భంగా ఆదివారం పోతంగల్ బస్టాండ్ వద్ద పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పలువురు ముదిరాజ్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.ఈ సంధర్బంగా ఐదు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పోలీస్ కిష్టయ్య అని కొనియాడారు. తెలంగాణ మలిదశా ఉద్యమం ప్రాణాలను అర్పించిన కిష్టయ్యకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కొరకు ఎంతోమంది ప్రాణాలకు తెగించి రాష్ట్రం కోసం పోరాడుతున్న తరుణంలో తెలంగాణ ప్రాణాల ద్వారా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి రాష్ట్రం వస్తదని తన పోలీస్ వృత్తిలో ఉండి సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని మలిదశ ఉద్యమం తొలి ఆమరుడు అయ్యాడు.పోలీస్ కిష్టయ్య అని అన్నారు. పోలీస్ కిష్టయ్య జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా జరపాలని ప్రతి మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సొప్ప గణేష్, ఉత్తం, చింతల హనుమాడ్లు, కంచం హనుమాడ్లు, నిరడి బుమయ్య, సొప్పా గంగారం, గోపాల్, మొట్టడి శంకర్, సురేష్, గౌరజి ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.