Monday, December 23, 2024

ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

ఏడుగురు మావోయిస్టులు మరణం

ద్రోణ ములుగు ప్రతినిధి

ములుగు జిల్లా ఏటూరునాగారంలో నేటి తెల్లవారుఝామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు సమాచారం. .ఆయనపై 20 లక్షల రివార్డ్ ఉంది.
గతంలో ఇదే ప్రాంతంలో ఘటన కొన్నేళ్ల క్రితం ఏటూరునాగారంలోని చల్పాకలో ఒళ్లు గగ్గురు పొడ్చే ఘటన చోటు చేసుకుంది. పీపుల్స్ వారు మందుపాతరకు పోలీసులు జీపు ఎగిరిపడి… పోలీసుల అవయవాలు చెట్లపై పడిన ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. మళ్లీ ఇదే ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరగడంతో ఆ ఘటన నేడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు..
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి వివరాలు:1. కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, 35 సంవత్సరాలు, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్. TSCM, సెక్రటరీ యెల్లందు – నర్సంపేట AC, AK-47 రైఫిల్, ఏగోళపు మల్లయ్య @ మధు, DVCM 43 సంవత్సరాలు, , రామగిరి (m), పెద్దపల్లి జిల్లా, తెలంగాణ. DVCM,కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ AC, AK-47 రైఫిల్,
ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM, 22 సంవత్సరాలు, తంబేల్బట్టి (v),ఉసుర్ (m), బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్. G3 రైఫిల్
ముస్సాకి జమున, ACM, 23 సంవత్సరాలు , పొరోవాడ (v), బైరామ్‌ఘర్
జై సింగ్, పార్టీ సభ్యుడు, వయస్సు: 25 సంవత్సరాలు, ఇంద్రావతి ప్రాంతం, .303 రైఫిల్.
కిషోర్, పార్టీ సభ్యుడు, వయస్సు: 22 సంవత్సరాలు, n/o పాంపాడ్ (v), గంగులూరు PS, బీజాపూర్జిల్లా, ఛత్తీస్‌గఢ్, ఇన్సాస్ రైఫిల్.
కామేష్, పార్టీ సభ్యుడు, వయస్సు: 23 సంవత్సరాలు, n/o మలంపెంట (v), ఉసూర్ PS, బీజాపూర్జిల్లా, ఛత్తీస్‌గఢ్, SBBL గన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular