Monday, December 23, 2024

మహదేవ్ పూర్ మండలంలో క్షుద్ర పూజలు?

ద్రోణ భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.
ఆదివారం ఉదయం కుదురుపల్లి గ్రామానికి చెందిన యువకులు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లగా వాగులో క్షుద్ర పూజలు చూసి భయాందోళనలకు గురయ్యారు. మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం బట్టలను వదిలేసారు.
క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను చూసి జనం సైతం ఆందోళన చెందుతున్నారు.తమ గ్రామంలో ఇటువంటి పూజలు నిర్వహించిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, గ్రామస్తులు కోరుతున్నారు.ఇటువంటి భయానక పూజలు మరోసారి నిర్వహించకుండా చూడాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉండ గా, అర్ధరాత్రి పూజలు నిర్వహించడంతో ఎవరికి ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయపడుతు న్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular