కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
ద్రోణ నిజామాబాద్, డిసెంబర్ 03
తెలంగాణాలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమయిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీ.సీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ, అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరించడానికి బీ.సీ డెడికేటెడ్ కమిషన్ ఈ నెల 5న నిజామాబాద్ కు విచ్చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం ఉదయం. 11.30 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము (కలెక్టరేట్)లో బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్, సెక్రటరీ బి.సైదులు, ఐ.ఎఫ్.ఎస్, ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారని తెలిపారు. ఉమ్మడి (నిజామాబాద్ & కామారెడ్డి) జిల్లాలోని ఆయా కులాల స్థితిగతులపై డిడికేటేడ్ కమిషన్ కు వివిధ సంఘాల వారు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని సూచించారు. అభిప్రాయాలు తెలియజేసే వారు తమ వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటిరియల్, ఆధారాలను సాక్షాలను వారి అభ్యర్థనలతో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.