నాణ్యత లోపం లేకుండా పనులు వేగవంతం చేయాలి
పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
ద్రోణ బాన్సువాడ ప్రతినిధి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను మంగళవారం ఆకస్మికంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి. ఆయన వెంట రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు ఉన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ రూ. 258 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టీఎంసీ కేపసిటీ తో నిర్మిస్తున్నాం, నిర్మాణ పనులు త్వరితంగా పూర్తి కావాలి.
24 గంటలు నిర్మాణ పనులు షిఫ్టుల వారిగా జరిపించాలి
నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను మరింత వేగంగా జరిపించాలని ఎక్కువ యంత్రాలను తెప్పించి మరింత వేగంగా రాత్రింబవళ్లు పనులు చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
పనులు వేగంగా జరిపించడంతో పాటుగా నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు.
రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాను.వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తి చేయాలి.
సిద్దపూర్ రిజర్వాయర్ నా ఆశయం,ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా సాగునీరు అందాలి,ఆర్థికంగా రైతులు స్థిరపడాలని నా కల అని పోచారం వ్యక్తం చేశారు.