మంత్రి సీతక్క
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
ప్రపంచ వికలాంగుల దినోత్సవము మంగళవారం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళ, శిశు సంక్షేమ శాఖ &పంచాయితి రాజ్ శాఖ మంత్రి సీతక్క & వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచంలో ఉన్నవికలాంగులు అందరు డిసెంబర్ 3 నీ పండుగ రోజు లా జరుపుకోవడం చారిత్రక అంశం అన్నారు.
వైకల్యం తో బాధపడకుండా ఆత్మ స్థైర్యం తో ప్రపంచాన్ని జయించిన వికలాంగులు మానవాళి కి ఆదర్శం అన్నారు.కేంద్రం పెన్షన్ నీ 300 ల నుండి 3000 వేలకి పెంచాలి అన్నారు కేంద్రము లో* అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పెంచక పోవడం దారుణమని అన్నారు.త్వరలోనే కేంద్రం పెన్షన్ పెంచేలా కేంద్రమంత్రులు బిజేపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలు బిజేపి పై వత్తిడి తేవాలి అన్నారు.మేము త్వరలోనే పెన్షన్ పెంచడం తో పాటు వికలాంగులకు ఆర్దికంగా ఆదుకుంటామని అన్నారు.ఇప్పటికే జాబ్ పోర్టల్ కూడా ప్రారంభించామని రాబోయే 4ఏండ్ల లో ఎన్నడు లేని విధంగా వికలాంగుల సంక్షేమం లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని అన్నారు.
ఎన్నడు లేని విధంగా ఈ సారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యారేజ్ ఇన్సెంటివ్ లకు 10 కోట్ల రూపాయలు కేటాయింపులుచేసిందనీ మొత్తం వికలాంగుల సంక్షేమం కి 87 కోట్ల 81లక్షల రూపాయలు కేటాయించిందని ఆన్నారు. ఉద్యోగాలలో 4%, సంక్షేమము లో 5% రిజర్వేషన్* అమలు పరుస్తామని తెలియజేశారు.
వికలాంగుల సంక్షేమ శాఖ నీ, వికలాంగుల కార్పొరేషన్ నీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నే అని, మొదట పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అనీ, నెలసరి పెన్షన్ నీ అమలు చెసింది కాంగ్రెస్ పార్టీ నే అనీ ఉపాధి హామీ పథకం తెచ్చి క వికలాంగులకు 100 రోజులు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ నేనని,వికలాంగులు హక్కుల చట్టం -2016 నీ ఏకసభ్య కమిషన్-2011 ద్వారా రూపొందించింది.కాంగ్రెస్ పార్టీనే అనీ,వికలాంగుల కీ విద్య లో & ఇండ్లలో రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అనీ అసలు ఇప్పటి వరకు వికలాంగుల కి అమలు అవుతున్న చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఖచ్చితంగా రాబోయే 2నెలల్లో వికలాంగులకు వేల మందికి ఉచితంగా 40%వైకల్యం కి సహాయ ఉపకరణాలు పంచుతామని
తెలియ జేశారు.గత ప్రభుత్వ హయం లో నెలకొన్న వికలాంగుల సమస్యలు ,వికలాంగ ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వికలాంగుల కార్పొరేషన్ లో మొదటి 100 రోజుల్లోనే మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమూల మార్పులు చేస్తూ ప్రక్షాళన చేశాం ఆన్నారు.
ముఖ్య మంత్రి వర్యులు వికలాంగుల ఆత్మ బంధువు రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే ప్రాజా పాలన తెచ్చారని ఒక్క సంవత్సరం లోనే 87 మందీ ప్రభుత్వ హాస్టళ్ల లో ఉండే వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వికలాంగుల అందరినీ మంత్రి , ఛైర్మెన్ అభినందనలు తెలిపారు.
వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధించి
రాష్ట్రస్థాయి అవార్డ్స్ పొందిన 21 మందీ వికలాంగుల ను మంత్రీ , చైర్మన్ మెమెంటో, ప్రేజ్ మనీ & శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈకార్యక్రమం లో శాఖ సెక్రటరి అనితా రామ చంద్రన్, శాఖా డెరైక్టర్ శైలజ, ప్రభంజన్ రావ్ &వేల మందీ వికలాంగులు , వివిధ వికలాంగుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు వారీ కార్య వర్గాలు పాల్గొన్నాయి.