ద్రోణ బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లో మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహ ఏర్పాటు కు సహకరించాలని బోధన్ కమ్మ సంఘం అధ్యక్షుడు శివన్నారాయన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ను కోరారు. నిజామాబాద్ ప్రధాన రహదారి ఆచన్ పల్లి వద్ద విగ్రహ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కమ్మ సంఘ ప్రతినిధుల సూచన పై మాజీ మంత్రి సానుకూలం గా స్పందించారు .విగ్రహ ఏర్పాటు పై కలెక్టర్ కు సంఘ ప్రతినిధుల విజ్ఞప్తిని పరిశీలించాలని అన్నారు. సుదర్శన్ రెడ్డి ని కలిసిన వారిలో కమ్మ సంఘ ప్రతినిధులు గాంధీ ,రంగారావు, నాగేశ్వరరావు, పులి శ్రీనివాస్, తది తరులు ఉన్నారు.