పోతంగల్ లో 108 ప్రారంభించిన పోచారం
ద్రోణ కోటగిరి
అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితుల్లో 108 ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని, పేదలకు వరం లాంటిదని ఇట్టి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రము లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఉచిత అంబులెన్స్ 108 సేవల వాహనం పోచారం, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి మండల అధ్యక్షులు పుప్పాల శంకర్ , మరియు షాహిద్ హుస్సేన్ , కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హన్మంతు , మాజీ ఎంపిపి గంధపు పవన్ , పోతంగల్ గ్రామ అధ్యక్షులు పుల్కంటి సాయిలు ,ఎంపిటిసి మనోహర్,కేశ వీరేశం, బజరంగ్ దత్తు, రాజు, ముదిరాజ్ సంఘం నాయకులు ఉత్తం మరియు మండల వివిధ అనుభంద సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.