ద్రోణ బాన్సువాడ:-
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మంత్రి అంజవ్వ గణేష్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నూతనంగా నియమించడానికి సహకరించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర ఎం పీ టీసీల ఫోరం అధ్యక్షులు యమంచిలి శ్రీనివాస్ రావు , గిరిజన విభాగ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ , బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంత్రి గణేష్, మాజీ సొసైటీ చైర్మన్ మైలారం భాస్కర్ రెడ్డి , కమ్మ సత్యనారాయణ, అంజద్ ఖాన్, బాన్సువాడ మండల యువ నాయకులు భాను కలిసి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ లక్ష్మణ్ తెలిపారు.