కార్యక్రమాన్ని ప్రారంభించిన కాసుల
ద్రోణ రుద్రూర్
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని సీఎం కప్ క్రీడా పోటీల్లో పెట్టడం లక్ష్యాన్ని అధిగమించేందుకేనని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాల లో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. గ్రామ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి తనవంతు కృషి చేస్తున్నారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడానికి శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి మరియు తాను ఎల్లప్పుడూ ముందుంటానని బాలరాజు అన్నారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలోఎంపీడీఓ, మండల విద్యాశాఖ అధికారి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సురేష్ బాబా , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్ర శేఖర్ , మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ , మాజీ జెడ్పిటిసి నరోజి గంగారాం ,పత్తి రాము , లక్ష్మణ్ , ఎంపీటీసీ గౌస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ , ఖలేఖ్ , చిన్నారెడ్డి , షోయెబ్ , నితిన్ , కిషన్ తదితరులు నాయకులూ స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు.