Monday, December 23, 2024

మంత్రివర్గ విస్తరణ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని అందుకే ప్రచారంలో వెనుకబడ్డమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలనను తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు మల్లు భట్టి విక్రమార్క ఇవాళ(గురువారం) ఢిల్లీలో అల్పాహారం ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢిల్లీలో గురువారం రాహుల్ గాంధీని కలవలేదని అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
వందశాతం మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు. హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎవరు చెరువులను ఆక్రమించిన వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్‌లో రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని మల్లు భట్టి విక్రమార్క వివరించారు.తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో రూ.64 వేల కోట్ల అసలు వడ్డీ కట్టామని తెలిపారు. రాష్టం ఏర్పడే నాటికి ఏడాదికి రూ.6400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికే రూ.64 వేల కోట్లు కట్టాల్సి వచ్చిందనిమల్లు భట్టి విక్రమార్కతెలిపారు.
తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది అందుకే ప్రచారంలో వెనుకబడ్డమని అన్నారు. పదేళ్ల తర్వాత హాస్టళ్లకు ఇచ్చే డైట్ చార్జీలు పెంచామని తెలిపారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలన తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular