ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
కోనేరు శశాంక్ బిజెపి గూటికి చేరారు. ఎత్తొండ గ్రామానికి చెందిన విదేశీ భారతీయుడు భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల కోటగిరి మండలానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నా జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం గా భావిస్తున్నాను అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో, నా స్వీయ ప్రాంతానికి మరియు దేశానికి సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ (భాజపా)లో చేరాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.భారతీయ జనతా పార్టీ అనేది ప్రజా సంక్షేమం, అభివృద్ధి, శాంతి, మరియు దేశభక్తి మార్గంలో కట్టుబడిన పార్టీ. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ పార్టీలో చేరడం ద్వారా, నేను నా సేవలను, సామర్థ్యాలను దేశం కోసం, ప్రత్యేకంగా బాన్సువాడ ప్రజల కోసం అంకితమయ్యే విధంగా
ఉపయోగించుకోగలుగుతానని భావిస్తున్నాను అని తెలిపారు.
నేను ఒక విదేశీ భారతీయుడిగా (NRI) అనుభవాలను, ప్రపంచస్థాయిలో నేర్చుకున్న పాఠాలను, ప్రజల సమస్యల పరిష్కారంలో వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాను. నా కృషి, బాన్సువాడ ప్రజలకు శ్రేయస్సు, అభివృద్ధి, మరియు సుస్థిర ప్రగతి తెచ్చే దిశగా కొనసాగుతుంది.భారతీయ జనతా పార్టీలో చేరడం నాకు గౌరవంగా, బాధ్యతగా అనిపిస్తుంది. ఈ పార్టీ కల్పించిన సౌకర్యాలు, సమగ్ర దృష్టికోణం, మరియు ప్రజల ఆవశ్యకతలను కేంద్రంగా పెట్టిన విధానాలు నన్ను ఆకర్షించాయి.బీజేపీ కుటుంబం లో చేరిందుకు నాకు చాలా ఆనందగా ఉందినీ బాన్సువాడ నియోజకవర్గం బీజేపీ ప్రతి ఒక్క కార్యకర్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాను అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, నా నూతన రాజకీయ ప్రయాణానికి మీ అందరి మద్దతు, ఆశీర్వాదాలు ఉండాలని, ఈ ప్రాంతం మరింత ప్రగతి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.