ద్రోణ నిజాంసాగర్
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా యాసంగి పంటల సాగుకు శుక్రవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు.
ఆయన వెంటరాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి ,జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు , మాజీ మంత్రి బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు ఉన్నారు.