ద్రోణ బోధన్ ప్రతినిధి:-
భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన 6 గ్యారెంటీలు అమలుపరచలేనందుకు 6 గ్యారెంటీలు 66 మోసాలకు గాను బోధన్ పట్టణం లో ని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 66 మోసాలను చూపించి అధికారం లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకోకుండా పాలన చేస్తుంది. రాష్ట్రం మొత్తం ఒక్క ఎత్తు ఉంటే బోధన్ నియోజవర్గం ఒక ఎత్తు ఉంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు మీరు ప్రజా దర్బార్ ప్రారంభం చేశారా ముందు మీరు బోధన్ నియోజవర్గం లో ప్రజా ధర్భార్ ప్రారంభించి మీరు బోధన్ మనిషి అనిపించుకోండి అన్నారు.
ప్రజల సమస్యలను ఏ రోజుకు ఆరోజు చెప్పుకొనేలె ఉండాలి తప్ప మీ కోసం నిజామాబాద్ కో హైదారాబాద్ కో మీరూ నాయకుల కోసం ఎదురు చూసేలా ప్రజలకు శిక్ష వేయకండి అన్నారు. బోధన్ లో ప్రజా ధర్భార్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండగలరు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో నడిపే సోదరులకు సంవత్సరానికి 12000 ఇస్తుంది అని చెప్పింది ఫ్రీ బస్ లు పెట్టి వారి కడుపు కొట్టింది. ప్రతి మహిళకు 2500 ఆర్థిక సహాయం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులను, ఇతర రంగాలను కాంగ్రెస్ నాశనం చేసింది.
ఇప్పటి కైన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీరు మంత్రి పదవి పై పెట్టే దృష్టి లో 5 శాతం బోధన్ నియోజవర్గ ప్రజల పై బోధన్ నియోజవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. ముందుగా ప్రజా దర్బార్ ప్రారంభం చేయండి. అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాస్తా కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి , వడ్డీ మోహన్ రెడ్డి ,అడ్లూరి శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు నరసింహారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, పట్టన అద్యక్షులు కొలిపాక బాలరాజు, ప్రధాన కార్యదర్శి కందికట్ల వాసు, కౌన్సిలర్ వినోద్, బిజెవైఎం పట్టణ అద్యక్షులు గౌతమ్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, సీనియర్ నాయకులు కందికట్ల రామచంద్రర్ , జడ్పీటీసీ మేక విజయ సంతోష్ వివిధ మండలాల అధ్యక్షులు కొలిపాక బాలరాజు, సరిన్, మనోహర్, గోపీకృష్ణ, ఇంద్రకరణ్, ప్రవీణ్ ప్రధాన కార్యదర్శిలు , వివిధ మోర్చ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.