Monday, December 23, 2024

జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోల విట్టల్

ద్రోణ బోధన్:-

నిజామాబాద్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులుగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బోధన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పటికే సమాజ సేవకు ఎంతో ముందుండి ఎన్నో ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందడం ఆర్యవైశ్యులకు గర్వంగా ఉందని ఆర్యవైశ్యులు వ్యక్తం తనను జిల్లా అధ్యక్షులుగా ఆమోదిస్తే ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తానని ఆయన అన్నారు.మరియు ఆర్య వైశ్యుల సమస్యల గురించి చర్చించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో బోధన్ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కొత్త రవీందర్ , ప్రధాన కార్యదర్శి వాసర గంగాధర్ , డివిజన్ ఇంచార్జి కంటాల రమేష్ , ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామ్, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్త రాజేశ్వర్ , సంఘం సీనియర్ నాయకులు చిదుర ప్రదీప్ మరియు బోధన్ ఆర్య వైశ్య సంఘం సభ్యులు, కోటగిరి, పోతంగల్ మండలాల ఆర్య వైశ్య సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular