ద్రోణ బోధన్
కోటగిరి ఏఎంసీ చైర్మెన్ గాయక్వాడ్ హనుమంతుకు శనివారం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని రైస్ మిల్ భవన్ లో ఘన సన్మానం. చైర్మన్ నాయకులు పట్టుదలతో కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లపాటు క్రియాశీల కార్యకర్తగా పార్టీ పటిష్టతకు పనిచేసి గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అమలుకై భవిష్యత్ కార్యాచరణలో భాగంగా మందకృష్ణ మాదిగ చేపట్టే ఉద్యమంలో కలిసివెళ్లడానికి సీనియర్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రేణిగుంట నాంపల్లి దిశ నిర్దేశం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుచేసే వరకు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమించడానికి కలిసి వెళ్లడానికి నాయకులు సలహాలు, సూచనలు ,అభిప్రాయం తెలిపారు.కార్యక్రమంలో నాయకులు గంధం చంద్రయ్య, గడ్డం రమేష్,డప్పుల చంద్రయ్య, సీనియర్ జర్నలిస్టులు నర్సింలు, సాయిలు, విజయ్, లక్ష్మణ్,అబ్బయ్య,శ్రీకాంత్, ఉద్యోగ సంఘాల నేత అబ్బయ్య, రిటైర్డ్ ఎంప్లాయి భూమయ్య,న్యాయవాది అడ్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.