ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం
ద్రోణ కోటగిరి
భక్తి భావాలను పెంపొందించుకొని ప్రజలు మంచి నడవడికను అలవర్చుకోవాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా
కోటగిరి మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో దత్త జయంతి వేడుకలు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు గ్రామ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పోచారానికి దత్తాత్రేయ ఆశీస్సులు అందించారు. నూతనంగా నిర్మించిన దత్తాత్రేయ మందిరంలో వైభవంగా జరిగిన విగ్రహప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనీ పోచారం ప్రత్యేక పూజలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తత్రేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలకు దత్తత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తో పాటు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.