బర్ల మధు ఆధ్వర్యంలో సంజీవని హాస్పిటల్ సేవలు
ద్రోణ కోటగిరి
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్ గా ఫారంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బర్ల మధు ఆధ్వర్యంలో సంజీవని హాస్పిటల్ వారు వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ శిబిరానికి అనూహ్యస్పందన లభించింది. డాక్టర్ ఇంతియాజ్ బేగం పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. 120 మంది పరీక్షలు చేయించుకున్నారు. హాంగర్గా ఫారం గ్రామం తరపు నుంచి సంజీవిని హాస్పిటల్ సిబ్బందికి బర్ల మధు కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎజాస్ ఖాన్ విలేజ్ ప్రెసిడెంట్ సజ్జత్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.