కార్పొరేషన్ చైర్మన్ కాసుల
ద్రోణ బాన్సువాడ
గ్రామీణ క్రీడాకారులు ఉత్సాహపరిచేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్పష్టం చేశారు.
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం జిల్లా స్థాయి సీఎం క్రీడా పోటీలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని భావించి క్రీడాకారులకు మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించడానికి 200 కోట్లు బడ్జెట్లో కల్పించడం జరిగిందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.