Monday, December 23, 2024

అక్రమ ఇసుక రవాణాపై పోతంగల్ తహసిల్దార్ కొరడా

పోతంగల్ మండలం పరిధిలోని పలు గ్రామాల మంజీరా నది నుండి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు ప్రజల నుండి అనేకమైన ఫిర్యాదులు ప్రతినిత్యం అందుతున్నాయి. మంజీరా నది నుండి కొంతమంది అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఇతర ప్రాంతాల్లో నిల్వచేసి లారీల్లో దూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు పోతంగల్ తాసిల్దార్ అక్రమ రవాణా పై కొరడా ఘలిపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను నియంత్రించే పనిలో పోతంగల్ తాసిల్దార్ మల్లయ్య నిమగ్నమయ్యారు. అక్రమ రవాణా నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాత్రివేళ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బందితోపాటు పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి మంజీరా తీరంలో సంచరిస్తున్నారు. రెవిన్యూ అధికారుల తీరుతో అక్రమార్కులు కొంతవరకు కట్టడి అయ్యారు. ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసిన కొంతమంది ఇసుకసురులు ఈజీ మనీకి అలవాటు పడి ఇసుక రవాణా తమ లక్ష్యంగా భావిస్తూ అక్రమ రవాణా జరిపే ప్రయత్నం చేస్తున్నారు.

కోటగిరి తాహసిల్దార్ పని బేష్

కోటగిరి తాహసిల్దార్ మండల ప్రజలకు తన వంతు సేవలను అందించడంతోపాటు, కార్యాలయానికి వచ్చే వారితో ఎంతో మర్యాదగా నడుచుకోవడంతోపాటు ప్రజల పనులను ఎప్పటికప్పుడు చేస్తూ మండల ప్రజల మన్నానలు పొందారు. తాను తాసిల్దార్, మండల మెజిస్ట్రేట్ అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఎక్కడ తాను ఉన్నతాధికారి భావన లేకుండా తాను ఓ సామాన్యుడిలా వ్యవహరిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ కార్యాలయానికి వచ్చేవారికి సహకరిస్తూ ఉంటారు. తాహసిల్దార్ లో ఉన్న అతి మంచితనాన్ని కొంతమంది అక్రమార్కులు అక్రమ ఇసుక రవాణాకు తెరలేపుతున్నారు. అక్రమ ఇసుక రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, లేక అక్రమార్కులు మరింత అక్రమాలకు పాలు పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే తాహసిల్దార్ హెచ్చరించారు.

కొడిచర్ల లో 50 ట్రిప్పుల ఇసుక సీజ్

కోటగిరి మండలం కోడిచర్ల గ్రామ మంజీరా నుండి కొంతమంది గ్రామానికి చెందినవారు ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువచ్చి మంజీరా సమీపంలోని రోడ్డుపై నిల్వ చేశారు. ఆదివారం రాత్రి రెవెన్యూ సిబ్బంది పెట్రోలింగ్ బృందం ఇసుక నిల్వలను గుర్తించారు. ఇట్టి ఇసుకను ప్రభుత్వం వారి స్వాధీనంలోకి తీసుకుందామని తాహసిల్దార్ మల్లయ్య తెలిపారు. ఇట్టి ఇసుకను ప్రభుత్వ పనులు నేషనల్ హైవే వారికి అనుమతులు ఇచ్చి ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాను నిలిపి అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇసుక అవసరం ఉన్నవారు డీడీలు చెల్లించి తమకు అందిస్తే అనుమతులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular