ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-
జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజానరసింహ ని కలిసి కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించడం జరిగింది. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) జిల్లా గౌరవాధ్యక్షులు వై.ఓమయ్య, జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వెయ్యి పడకలకు పెంచాలని పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల వేతనాలు పెంచాలని మంత్రికి తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని జిల్లాల వారు ఆరోగ్య పరీక్షల కోసం ప్రతిరోజు సుమారు అవుట్ పేషంట్ లు 2500 మంది ఇన్ పేషెంట్లు 1500 మంది ఉంటున్నందున జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులపై పనిభారం పెరుగుతున్నది. కావున 1000 పడకలకు పెంచి శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచి కార్మికులకు వెంటనే జీవో నెంబర్ 60 ప్రకారం 13,400 తోపాటు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు హైమది, భాగ్యలక్ష్మి ,వెంకట్, రాధా కుమార్ మరియు కార్మికులు పాల్గొన్నారు