Friday, April 18, 2025

రైతాంగ పోరాటం ద్వారానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారం

కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించింది

జై జవాన్ జై కిసాన్ నినాదానికి బదులు జై అంబానీ, జై ఆదాని అని మోడీ

ప్రెస్ క్లబ్ నుంచి గోనే రెడ్డి ఫంక్షన్ వరకు భారీ ర్యాలీ

అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు

నిజామాబాద్ టౌన్ ప్రతినిధి (ద్రోణ):-

రైతాంగ పోరాటం ద్వారానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రైతులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు నిజామాబాద్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ర్యాలీ మొదట నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభం కాగా పూలాంగ్ చౌరస్తా మీదిగా గోనె రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ రైతు ర్యాలీలో పాల్గొన్న రైతులపై పువ్వులుచల్లి ఆహ్వానం పలికారు పులాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గోనె రెడ్డి ఫంక్షన్ హాలులో బహిరంగ సభ నిర్వహించగా

ఏ ఐ కే ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆహ్వాన సంఘం కోశాధికారి కంజర భూమయ్య సభ అధ్యక్షత వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంత రావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహా సభలను ఉద్దేశించి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందని, మూడు నల్ల చట్టాలను తెచ్చి రైతులను నిండా ముంచిందన్నారు. చారిత్రాత్మకమైన రైతుల పోరాటాల ఫలితంగానే మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయబడ్డాయని గుర్తు చేశారు.

మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని అన్నారు. పేద మధ్యతరగతి రైతులకు న్యాయం జరిగేలా చట్టాలు రూపొందించడం లేదని హెచ్చరించారు. పసుపు బోర్డు తెస్తామని చెప్పి ఎంపీ గా గెలిచిన ధర్మపురి అరవింద్, ఏట్టకేలకు పసుపు బోర్డు ఇచ్చిన పసుపుకు మద్దతు ధర ఇవ్వలేక రైతులను మోసం చేస్తున్నారన్నారు. పసుపు మద్దతు ధర ఇవ్వకుండా రైతులు రోడ్డు నెక్కే పరిస్థితి ఏర్పడేలా చేశారన్నారు. భారతదేశంలో నూటికి 75% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారని, వారికి సరైన సదుపాయాలు కల్పించ లేకపోవడంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతిరోజు దాదాపు 36 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే అందుకు కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధివిధానాలేనని అన్నారు. దేశంలో ఎన్నో జీవ నదులు ఉన్నప్పటికీని ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దేశంలో పంటలు పండే భూములు లేవా? జీవనదులు లేవా? కష్టపడి రైతులు లేరా అని ప్రశ్నించారు.

కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం వల్లనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రపంచ దేశాలలో వ్యవసాయానికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే,మోడీ ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు ఇవ్వకుండా, అంబానీ ఆదానిలాంటి కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నాయన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగునీటి కోసం ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సంపూర్ణంగా నిర్మించలేకపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేదని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే జాతీయ హోదా కల్పించి, నిధులు విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో సైతం
కృష్ణ నది లో వాటా తేల్చక పోవడం తో ఆంధ్రకు నీళ్ళు దోచుకుపోతున్నారని గుర్తు చేశారు.
భాగం హేమంతరావు,పశ్య పద్మ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆకర్షితులై ప్రజలు ఓట్లు వేశారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేర్చాలన్నారు.

రెండు లక్షల రుణ మాఫీ పూర్తి గా అమలు కావడం లేదనీ, రైతు భరోసా పూర్తిగా అందలేదని, రైతులు పండించిన పసుపు, మిర్చి, వరి పంటకు గిట్టుబాటు ధర అందడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని అన్నారు.
ఇటీవల తెలంగాణ జిల్లాలో వడగళ్ల వానతో తీవ్రంగా పంట నష్టం జరిగిందని, ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మోడీ ప్రభుత్వంతోనే వ్యవసాయం సంక్షోభంలో కురుకు పోయిందన్నారు.కార్పోరేట్ వర్గాలకు భూమిని అప్పజెప్పి కుట్ర పన్నుతున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు అంబానీ, ఆదానీ అప్పులు మాఫీ చేశారని, రైతులకు మాత్రం మేలు జరిగే పనులు చేయడం లేదన్నారు. ప్రశ్నించే గొంతుకలు శక్తులను సాయిబాబా, వరవరరావు లాంటి వారిని నిర్బంధించి అణచివేసే కుట్రలు చేశారన్నారు. మోడీ ప్రభుత్వం చతిస్గడ్ లో ఆదివాసీల మీద యుద్ధం ప్రకటించి, రాజ్యాంగ ఉల్లంఘన చేసి
దౌర్జన్యంగా పాలన సాగిస్తుందన్నారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే
ప్రతి ఒక్కరు కంకణ బద్ధులు కావాలని, రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆలోచన చేస్తా ఉన్నదని, అలాంటి కుట్రలు జరుగుతున్నాయని, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున కలిసి, కార్మిక , కర్షకవర్గాలు ఏకమై పోరాటాలు సాగించాలని అందుకు ఈ మూడు రోజులపాటు ప్రణాళికలు రచించెందుకు ఈ మహాసభలు ఎంతో దోహదపడతాయన్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ఆహ్వాన సంఘం అధ్యక్షులు నర్రా రామారావు రైతులనుద్దేశించి ప్రసంగించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్డికే రాజేశ్వర్ మరియు రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు ఆహ్వాన సంఘం నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular