తన ఆత్మీయుడు అంబర్ సింగ్ మృతి పోచారం కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మీయులు తన నుండి దూరం కావడం తనకు ఎంతో బాధను కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షులు అంబర్ సింగ్ నిన్న గుండె పోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకుని బుధవారం అంబర్ సింగ్ స్వగ్రామం రాంపూర్ తండాకి వెళ్ళి పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి .
అంబర్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.
అనంతరం అంబర్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అంతిమ యాత్రలో పాల్గొన్న పోచారం.
నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం తో ఉన్నారు.





