Saturday, April 12, 2025

రైతు అనుకుంటే ప్రభుత్వాలను గద్దె నెక్కించగలరు, గద్దె దించగలరు

నిజామాబాద్ టౌన్ ప్రతినిధి (ద్రోణ):-

స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలి .

రైతు అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుంది

రెండవ రోజు కొనసాగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు

స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్థాస్ జానయ్య అన్నారు.

రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు నిజామాబాద్ లోని బి ఎల్ ఎన్ గార్డెన్ లో ప్రారంభం కాగ, ఉదయం మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావు జెండా ఆవిష్కరణ చేశారు.

అమరుల వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. మొదట స్వాగత ఉపన్యాసాన్ని ఆహ్వాన సంఘం అధ్యక్షులు నర్రా రామారావు గావించారు. ఈ సభా కార్యక్రమానికి భాగం హేమంతరావు , ముత్యాల విశ్వనాథం, రవీందర్ రెడ్డి, దేవ భక్తుని సంధ్య, డి.జి నరేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. కౌలు రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోపోజిట్ సూర్యనారాయణ అతుల్ కుమార్ అంజాన్ కు, ఈ మధ్యకాలంలో మరణించిన రైతులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ వ్యవసాయ విద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్దాస్ జానయ్య, అఖిలభారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ విశ్లేషకులు సోమర్ల వ్యవసాయ శాస్త్రవేత్త దొంతి నర్సింహారెడ్డి,
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యకలాపాల నివేదిక పై పశ్య పద్మలు మాట్లాడారు.

ఈ మహా సభలను ఉద్దేశించి

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్థాస్ జానయ్య మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో రైతు బాగుంటే, రైతు అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ది అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత అన్నారు. మద్దతు ధర కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. నేను ఒక రైతు బిడ్డనే రైతు కష్టాలు కళ్ళారా చూశానని, వ్యవసాయం పై మూడు దశాబ్దాలకు పైగా అధ్యయనం చేస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకు పాలకులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. నిత్యం రైతులతో మాట్లాడుతూ వారికి ఉన్న సమస్యల మీద సమస్యల పరిష్కారం కోసం సేవ అందించే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. రైతులు వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి,
అందులో ప్రభుత్వంలో పాత్ర ఏమిటి? రైతుల పాత్ర ఏమిటి ?
అని విశ్లెషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రైతుల సమస్యల మీద ఎంత మాట్లాడినా తక్కువేనని. ఒక సమస్య పరిష్కారం అయ్యే లోపు మరో సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తులు పెరిగాయని, అందుకు మనం గర్వపడాల్సిన అవసరం ఉందని. మరో విధంగా బాధపడాల్సిన అవసరం కూడా ఉందని. పరితోపాటు మిగతా ఉత్పత్తులు కూడా పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు.వ్యవసాయ ఉత్పత్తుల లాభాలు రైతులకు అందిస్తున్నాయా లేదన్నది మొదటి ప్రశ్న అని, కష్టపడి పండించిన తర్వాత ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకోవాలి? ఏ ధరకు అమ్ముకోవాలి అనేది ప్రశ్నార్థకం అయ్యిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాల క్రితం మూడు చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని. కానీ మూడు చట్టాలలో కొన్నింటిని కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరేలా ఉన్నాయన్నారు. చట్టాలు అధికారికంగా ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ ఇచ్చే విధంగా ఉన్నాయని. ఇది బాధ్యతారహితము అన్నారు. రైతులంటేనే ప్రభుత్వాలను గద్దె నెక్కించగలవు, ప్రభుత్వాలను గద్దె దింపగలవని రాజకీయ పార్టీలు మరిచిపోకూడదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు మేలు జరిగే విధానాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు కీడు కలిగించే ఎలాంటి విధానాలైనా సరే రైతు నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు శాస్త్రవేత్తలు అందరం కూడా వ్యతిరేకిస్తామన్నారు. ప్రపంచ దేశాలలో 35 దేశాలు తిరిగి చూశానని, రైతుల గురించి అధ్యయనం చేశామని అక్కడ కూడా రైతులకు ఇలాంటి పరిస్థితిలే ఉన్నప్పటికీ మన దేశంలో ఇంకా ఎక్కువగా సమస్యలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం. మద్దతు ధర అందిస్తున్నామని చెప్పడం సరి కాదని, కాస్ట్ సి 3 ప్రకారం రైతు ఖర్చు చేసే (రెంటల్ వ్యాల్యూ పై ఇంట్రెస్ట్, లోన్స్ పై ఇంట్రెస్ట్, బోర్ వెల్ ఇంట్రెస్ట్ పై ఇతర ఖర్చులు లెక్క చేసి ) 50 శాతం పై మద్దతు ఇవ్వాలని, ఏ 2 ప్రకారం మాత్రమే ఇస్తున్నారన్నారు. స్వామి నాథన్ సిఫార్సుల ప్రకారం చూస్కుంటే 30 నుంచి 35 తేడా ఉంటుందని అన్నారు. స్వామి నాథన్ చెప్పిన ప్రకారం లెక్కిస్తే రైతులకు. 30 నుంచి 35 శాతం తక్కువగా ఇస్తున్నారన్నారు. పూర్తి మద్దతు ధర ఇస్తే చాలావరకు రైతు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయన్నారు. రైతులు ఒకే రకం పంటలు కాకుండా అన్ని రకాల పంటలు వేయాలని సూచించారు.పంట మార్పిడి అనేది రైతుకు లాభదాయకమైనదని అన్నారు. సాంప్రదాయ పంటలు మరుగవుతున్నాయని, విటికి ఎక్కువ మద్దతు ఇచ్చి పండించిన పప్పు ధాన్యాలను సేకరించి వాటిని ప్రోత్సహించే విధంగా స్పెషల్ బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయంలో ఉన్న మరొక సమస్య లేబర్ సమస్య అని, విద్య వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ. వ్యవసాయేతర పారిశ్రామిక రంగాలు పెరుగుతున్న కొద్దీ , వ్యవసాయంలో లేబర్ ఇతర రంగాల వైపు మల్లుతున్నారని, వ్యవసాయంలో శాసన సాంకేతికత ను పెంచితే ఖర్చులు తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించి రైతులకు అందించినట్లయితే సకాలంలో వ్యవసాయం పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. డ్రోన్ అనేది 15 ఏళ్ల క్రితం ఊహించలేనిది. ప్రస్తుతం కీలకంగా మారిందని వ్యవసాయ రంగంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భారతదేశంలో విమానాలు కు పర్మిషన్ ఇచ్చే సి జి సి సి లైసెన్స్ , మా విశ్వవిద్యాలయానికి మొదటిసారి ఇవ్వడం జరిగిందని గుర్తు చేస్తారు. రైతన్నకి ఉపయోగపడే విధంగా డ్రోన్ డెమో ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువతకు డ్రోన్ వ్యవసాయ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో యువతకు వ్యవసాయ రంగంలో ఎంతో ఉపయోగపడేలాగా డ్రోన్ వ్యవస్థను తీసుకురానున్న మన్నారు. వీటి ద్వారా గట్టుమీద కూర్చొని వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అన్నారు. రానున్న రోజుల్లో రోబోలు వ్యవసాయ రంగంలో కీలకంగా మారనున్నాయన్నారు. హ్యాపీ రోబోటిక్స్ ల్యాబ్ ను కూడా
చెరుకుకు, కాటన్, పంటలకు ఏ విధంగా ఉపయోగపడనున్నాయి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఒక రైతు ఇంటి వద్ద కూర్చొని మొబైల్ చేత పట్టుకొని 95% పనులు చేసుకునే అవకాశం రాబోతున్నదన్నారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. బియ్యాన్ని ఎక్స్పోర్ట్ ఎగుమతి చేయాలంటే మన దగ్గర ఆధునికమైన రైస్ మిల్లలు లేవన్నారు..ఫిలిప్పీన్స్ దేశం లో తెలంగాణ బియ్యానికి మంచి డిమాండ్ ఉందని. ఈ రుచిని వారు చాలా ఎక్కువగా ఇష్టపడతారన్నారు. కానీ అందుకు తగ్గట్టుగా బియ్యంగా మార్చే రైస్ మిల్లులు మన వద్ద తక్కువగా ఉన్నాయన్నారు. థాయిలాండ్, పిలిపిన్స్, కంబోడియా
దేశాలలో ఉన్నట్టుగా రైస్ మిల్లులు మనదేశంలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లు వికసిత్ భారత్ 2047 తో వంద సంవత్సరాలలో అభివృద్ది చెందిన దేశంగా మారాలంటే గ్రామంలో ఉన్న రైతులు ఆర్థికంగా బలంగా మారాలని అప్పుడే అది సాధ్యం అవుతుందని అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు మొండి బకాయిలు 16 లక్షల కోట్లు కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చినవి నుంచి వసూలు చేసి, రైతన్నం కోసం ఖర్చు చేస్తే వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో రైతు భరోసా ఇచ్చి, రైతుకు ప్రోత్సా కాలు రాయితీలు అందించాలన్నారు. అన్ని రాష్ట్రాలలో మ్యాచింగ్ గ్రాండ్స్ ఇవ్వాలని సూచించారు. సపోర్ట్ ప్రైస్ కాకుండా గ్యారెంటీ ప్లేస్ అందించినప్పుడే రైతు వ్యవసాయం నుంచి లాభాలు సాధిస్తాడన్నారు.

అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ……


ప్రభుత్వం రైతులు పండించే పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేస్తే కోట్ల రూపాయలు లాభం వస్తుందని అలాంటిది మోడీ కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేస్తున్నాడని దుయ్యబట్టారు. రానురాను రైతుల భూములు పూర్తిగా లాక్కొని తామే పంట పండించుకుటామని చూస్తున్నారన్నారు. నైజం కాలంలో కూడా భూములకు చట్టాలు లేవని, 1850 లో మొట్టమొదటి సన్యాసుల సాయుధ పోరాటం చేశారని,1907 లో నైజం ప్రభువు భూ చట్టాలు చేశాడన్నారు. ఈ చట్టాలలో రైతువారి పట్టా, ముఠాదారి పద్దతి, గ్రామ ఖంఠం, దివాన్ భూములు, జమిందార్ భూములు, నిజాం భూములు, శిక్మిదారు భూములు గా విభజించారని, అదేవిధంగా కౌలు చట్టాలు కూడా చేశారన్నారు. ఇందులో 12 సంవత్సరాలు కబ్జాలో ఉంటే కబ్జా లో ఉన్నవారికే భూమి చెందుతుందని కానీ ఈ చట్టం 1997 తర్వాత మారిందన్నారు. మొట్టమొదటి భూ పోరాటం భువనగిరి లో జరిగిందని గుర్తు చేశారు. అనంతరం దొడ్డి కొమురయ్య మరణంతో ఈ భూ పోరాటం మరింత ఉద్రిక్తమయ్యిందన్నారు.ఎన్ని చట్టాలు వచ్చిన ప్రజల సమస్యలు తీరలేదని, 1973 లో భూ సంస్కరణల చట్టం వచ్చిందని, 1975 లో అమలు జరిగిందని అన్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన బొక్కలు లేని చట్టాలు లేవని అన్నారు. కేవలం కేరళ బెంగాల్ త్రిపుర వామపక్ష ప్రభుత్వాలు మాత్రమే చట్టాలను అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి చట్టం అమలు చేశారని ఇందులో 64 లక్షల మంది రైతులు ఉంటే 18 లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదని 6 లక్షల ఖాతాలు తప్పులు తడకలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ భారతి చట్టం చేశారని కానీ ఇంతవరకు చట్టానికి విధి విధానాలు లేవని, ధరణిలో 21 సెక్షన్లు ఉంటే భూభారతిలో 23 సెక్షన్లు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలను అధ్యయనం చేయాలని అదేవిధంగా ధనికులు భూస్వాములు పాలకవర్గాల గురించి అధ్యయనం చేయాలని దీనితో చట్టాలలో ఉన్న లొసుగులు తెలుస్తాయన్నారు. రైతులు సంఘటితమైతే తప్ప రైతు లాభపడి అవకాశం లేదని, రైతు రాజు కావాలంటే రైతు ధరను నిర్ణయించుకునే స్థాయికి చేరాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్వావర్ణ సందేశం సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం ఈ రైతు సంఘం మహాసభలో సందేశం ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular