Friday, February 13, 2026

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలుగుదేశం అభిమానులు కొని ఆడారు. బోధన్, పంట ఖుర్దు, సాలురా క్యాంప్, రుద్రూర్ మరియు వర్ని తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఎగరవేశారు. సీనియర్ నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు” అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించారు. బడుగు బలహీన వర్గాలకు స్వేచ్చని ఇచ్చిన పార్టీ, పేదలకు ఆత్మ గౌరవంతో కూడిన సంక్షేమాన్ని అందించిన పార్టీ, తెలుగింటి ఆడపడుచుల కోసం మహిళ సాదికారతను ఇచ్చిన పార్టీ తెలుగు జాతి అభ్యున్నతి కోసం మహోన్నతమైన ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు అని కొనియాడారు.
తెలుగు జాతి ప్రతి కష్టంలో, సంతోషంలో, అభివృద్ధి లో అండగా నిలిచిన ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. పార్టీని ఇంతగా ఆదరిస్తున్న ప్రజలకు, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రేణులకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈకార్యక్రమంలో అడ్హక్ కమిటీ మెంబర్స్ కోట గోపాల్ రెడ్డి, పాలూరు వెంకటేశ్వరరావు, సిహెచ్ వి హనుమంతరావు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, సచిన్ పటేల్, విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ రావు, మాజీ ఎంపీటీసీ శౌరయ్య చౌదరి, కందిమండ్ల శ్రీనివాస్, వంగళ్ల శ్రీను, బాబురావు, రామారావు,సుధాకర్ మేస్త్రి, ఈశ్వరరావు, M రామారావు, V వెంకటేశ్వరరావు, గోగినేని సుబ్బారావు, విఠల్, బొగుళ్ళ వినోద్, వై. సత్యనారాయణ, మార్ని రాజా, ఎం రవికుమార్, డి. కృష్ణారెడ్డి, సచిన్, వెంకటేష్, మద్దిపూడి శ్రీనివాస్, పెండెం సత్యనారాయణ, శివ, నరసింహులు, కౌశిక్ ,సుంకరి సాయిలు, గంగాధర్, హంగారగా సాయిలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular