Thursday, August 13, 2026

బుల్లెట్ ట్రైన్ కోసం రోడ్డెక్కిన సూర్యాపేట విద్యార్థులు

బుల్లెట్ రైలు రావాలా

ఉద్యమం ఆగాలా

హైదరాబాద్ ఆగస్టు 13 ద్రోణ

జాతీయ రహదారి 65 సమాంతర బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కోసం సూర్యాపేట లో కదం తొక్కిన విద్యార్థులు.
సూర్యాపేట
జాతీయ రహదారి 65 సమాంతర బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కోసం సూర్యాపేట లో కదం తొక్కిన విద్యార్థి లోకం కదం పెట్టింది.గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్ళు విద్యార్థులు నిరసనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. ఏ రోడ్డుకు చూసినా వేలాది మంది విద్యార్థులు బుల్లెట్ ట్రైన్ కేటాయింపు లో జరిగిన మోసాన్ని నివసిస్తూ ఉగ్రరూపం దాల్చారు. పట్టణంలోని 60 ఫీట్లరోడ్డు, కొత్త బస్టాండ్ ఏరియా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్,గాంధీ బొమ్మ సెంటర్, అన్ని సెంటర్లు కలుపుకొని వాణిజ్య భవన్ సెంటర్ లో వేలాది మంది విద్యార్థులు భారీ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి 65 సమాంతరంగా ఫిబ్రవరిలో బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ మంజూరు చేసి ఒక్కసారిగా అలైన్మెంట్లు మార్చడానికి తీవ్రంగా పరిగణిస్తూ ఆందోళన చేశారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ ఉద్యమం ఢిల్లీ పీఠం కదిలే వరకు వదిలేది లేదంటూ విద్యార్థులు విద్యార్థి సంఘాలు హేచ్చరించారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థి సంఘాలు సంయుక్తగా నిర్వహించిన సంయుక్తంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం పట్టణంలో అలజడి సృష్టించింది. సూర్యాపేటకు బుల్లి ట్రైన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు విద్యార్థుల వెంట కదం తొక్కారు. వాణిజ్య భవన్ సెంటర్లో విద్యార్థి సంఘాల నాయకులు సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ విషయంలో జరిగిన మోసాన్ని వివరించారు. జరిగిన అన్యాయాన్ని వర్గాలు గుర్తించి ఉద్యమంలో పాల్గొని వచ్చిన బుల్లెట్ ట్రైన్ తెచ్చు కునే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఐక్య విద్యార్థి సంఘం నాయకులు పుల్లూరి సింహాద్రి, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, భాష పొంగు సునీలు, ఎర్ర అఖిల్, బొమ్మగాని వినయ్ ,భారీ అశోక్, పోలోజు మహేష్, అహ్మద్ అలీ, పారాల సాయి, పోలేబోయిన కిరణ్, షేక్ జాంగిర్, వెంకటేష్ నాయక్ ప్రయివేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular