ఎమ్మెల్యే పోచారం
ఎవరేమనుకున్నా తన నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్న ఏనాడు డబ్బు కోసం పాకులాడ లేదని తన నియోజకవర్గంలో అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశానని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం, వర్ని మండలంలోని జాకోర, శంకోరా గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. వర్ని మండలం జాకోర గ్రామంలో SDF నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా జాకోర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయం,ప్రహరీ గోడను ప్రారంభించారు. శంకోర గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.











