Sunday, April 13, 2025

కోటగిరి ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

ద్రోణ కోటగిరి ఏప్రిల్ 4

కోటగిరి మండల ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు కొనుగోలు కేంద్రాన్ని లాంచనంగా ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం యాసంగి సీజన్ కు గాను ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. కోటగిరి మండలం లోని కోటగిరి ఐకేపీ మండల సమాఖ్య ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని ఇట్టి అవకాశాన్ని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ధాన్యం కొనుగోలు పట్ల ఐకెపి సిబ్బంది అప్రమత్తంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కూచి సిద్దూ, తాసిల్దార్ గంగాధర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రజినీ,కార్యదర్శి శ్రీగంగ, కోశాధికారి సావిత్రీ, ఐకేపీ ఏపీఎం బస్వంత రావు సీసీ లు విఠల్,సాయిబాబా అకౌంటెంట్ రాజు ఆపరేటర్ శ్రీదేవి,మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular