Friday, February 13, 2026

కల్తీ కల్లు వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలి

బాధితులను పరామర్శించిన పోచారం

ద్రోణ బాన్సువాడ ప్రతినిధి

కల్తీ కల్లు వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పరామర్శించారు. సోమవారం నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి , ఆసుపత్రి సూపరిండెంట్ విజయలక్ష్మి , ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల ,,బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు.
నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నిన్న కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురయ్యారు.వారిని ఎక్సైజ్, రెవెన్యూ,పోలీసు అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో బాన్సువాడ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి మరియు సిబ్బంది వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించారు.
అస్వస్థతకు గురైన దాదాపు 60 మందికి ఎవరికి ప్రాణాపాయం లేదు, కొంత మంది క్షతగాత్రులను వైద్య అవసర నిమిత్తం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రులకు తరలించారు.
ఎటువంటి ఒత్తిడులకు లోనవ్వకుండా కల్తీ కల్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు పోచారం ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular