Saturday, April 12, 2025

ఏప్రిల్ 11లోగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయండి

యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత వినతి

ద్రోణ హైదరాబాద్ :-

రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 11న పూలే జయంతిలోగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా పూలేకి గొప్ప నివాళి అర్పించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, యూనైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి బుధవారం నాడు శాసన సభలో స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత వినతి పత్రం అందించారు.

వెనుకబడిన వర్గాల పట్ల వివక్షకు ముగింపు పలకాలనీ ఈ దేశ సామాజిక సమానత్వానికి బాటలు వేసి దార్శనికులు పూలే అని కొనియాడారు. బడుగుల జీవితాలలో అక్షర వెలుగులు నింపి ఎంతో మంది మంది సంఘ సంస్కర్తలకు వేగుచుక్కగా నిలిచి దారి చూపారని కీర్తించారు. ఉదాత్తమైన భావాలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసనరం ఉందని పేర్కొన్నారు. కాబట్టి అలాంటి దారిలో సమానత్వ స్పూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో పూలే విగ్రహం ఏర్పాటు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అవసరమని, గత ఏడాది జనవరి 21న కూడా లేఖ ఇచ్చామని గుర్తు చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఉండాలన్నది వివిధ సామాజిర సంస్థలు, బీసీ సమాజపు చిరకాల కోరిక అని, ఈ విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత ఇనుమడింపజేయగలదని స్పష్టం చేశారు. కాబట్టి వెంటనే విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలను మొదలుపెట్టాలని కోరారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పిన విషయాన్ని వినతి పత్రంలో ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

స్పీకర్ ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మా రెడ్డి , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివ శంకర్ , జాగృతి నాయకులు శ్రీధర్ రావు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు అలకుంట హరి ,కొట్టాల యాదగిరి, ఆర్వీ మహేందర్ , కుమారస్వామి, విజయేందర్ సాగర్ , బాలకృష్ణ రాచమల్ల, కృష్ణమ చారి , ప్రవీణ్ కుమార్, సలవ చారి, గోపు సదానందం పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular